Share News

కమిషనరేట్‌ ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు

ABN , Publish Date - Mar 08 , 2026 | 12:07 AM

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు శనివారం నిర్వహించారు.

కమిషనరేట్‌ ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు

కరీంనగర్‌ క్రైం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీస్‌ కమిషనర్‌ గౌ్‌స్‌ఆలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లింలతో కలిసి సీపీ ఉపవాస దీక్షను విరమించి, వారికి రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... పవిత్ర రంజాన్‌ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి, మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టౌన్‌ ఏసీపీ వెంకటస్వామి, టౌన్‌ ఇన్‌స్పెక్టర్లు రాంచందర్‌రావు, సృజన్‌రెడ్డి, తిరుమల్‌, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్లు సంజీవ్‌, కుమారస్వామి పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2026 | 12:07 AM