Share News

బీజేపీ, బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే.. మురుగునీటిలో వేసినట్లే..

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:23 AM

బీజేపీ, బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మురుగునీటిలో వేసినట్లే ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే.. మురుగునీటిలో వేసినట్లే..

వేములవాడ, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): బీజేపీ, బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మురుగునీటిలో వేసినట్లే ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పట్టణంలోని 5,6,7,8,13వ వార్డుల్లో గురువారం స్ర్టీట్‌ కార్న ర్‌ మీటింగ్‌లో ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ఓటు వేస్తే మురుగు కాలువలో వేసినట్లేనని, అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే మరింత అభివృద్ధి పథంలో నిలుపుతానని అన్నారు. పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేయలేక గాలికి వదిలేసిన పనులను ప్రజల ఆశీస్సులతో పూర్తిచేస్తున్నా నన్నారు. గతంలో ఒకసారి బీజేపీ, ఒకసారి బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చారని ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండని అన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీని గెలిపించా లని వారి పార్టీ నాయకులు అడుగుతున్నారని, వాళ్లను గెలిపిస్తే నిధులు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పమనండని సూచించారు. కేసీఆర్‌ ఒక సామెత ఎప్పుడు చెబుతుండే వాడని.. దున్నపోతుకు గడ్డి వేసి బర్రెకు పాలు పిండితే రావు అనేవాడని గుర్తుచేశారు. మరి అధికారంలో లేనివాళ్లకు ఓట్లు వేస్తే అభివృద్ధి ఎట్లా జరుగుద్ది ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. బీజేపీ కేంద్రంలో పదేళ్లు గా అధికారంలో ఉంటుందని నిధుల వరద ఎక్కడ కనిపించలేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో వచ్చి రెచ్చగొట్టేవారిని ప్రజ లు పట్టించుకోవడం మానేశారని వివరించారు. వేములవాడ ప్రాం త ప్రజలు గత ప్రభుత్వ పాలనలో విసిగెత్తి ఉన్నారని, అభివృద్ధిని కోరుకుంటున్నారని, మరింత అభివృద్ధి చేసేందుకు 28 వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థుల చెయ్యి గుర్తుపై ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పట్ట ణశివారులో ఇంటి అడుగు స్థలం లేని వారికి భూమిని చూసామని, త్వ రలోనే 2వేల మందికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చేస్తామని హామీచ్చా రు. ఇంటి అడుగు స్థలం ఉన్నవారు మొదటి విడతలో మంజూరైన ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. కేకే మహేందర్‌ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ నాగుల సత్యనారాయణ,మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు, వైస్‌చైర్మ న్‌ కనికరపు రాకేష్‌ అభ్యర్థులు బొజ్జ భారతి, కాశ శ్రీనివాస్‌, సాగరం వెంకటస్వామి, అక్కనపల్లి నరేష్‌, మూడపల్లి నీలమ్మ ఉన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 12:23 AM