నీవేక్కడ డబ్బులు తీసుకున్నావో నిరూపిస్తా
ABN , Publish Date - May 21 , 2026 | 11:47 PM
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఎక్కడెక్కడ డబ్బులు తీసుకున్నడో సాక్ష్యాధారాలతో నిరూపించక పోతే నియోజవర్గంలోని ప్రతీ గుడిలో ప్రమాణం చేస్తానని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సవాల్ విసిరారు.
ఫ లేకుంటే ప్రతీ ఆలయంలో ప్రమాణం చేస్తా
ఫ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
పెద్దపల్లి టౌన్, మే 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఎక్కడెక్కడ డబ్బులు తీసుకున్నడో సాక్ష్యాధారాలతో నిరూపించక పోతే నియోజవర్గంలోని ప్రతీ గుడిలో ప్రమాణం చేస్తానని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆయన కార్యాలయంలో గురువారం విలేక రుల సమావేశంలో మాట్లాడారు. ఓదెల మల్లికార్జున ఆలయంతోపాటు పలు ఆలయాల్లో ప్రమాణం చేయ డంతోపాటు జెండావద్ద ముక్కు భూమికి రాస్తానన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిప డ్డారు. గతంలో 40 కిలోల 650 గ్రాములకంటే ఎక్కువ తూకం వేయనివ్వమన్న నాయకులే ఇప్పుడు 41, 42 కిలోల వరకు తూకం వేయిస్తున్నారని విమర్శించారు. ధాన్యం గ్రేడింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని, రైతు లకు రావాల్సిన అదనపు డబ్బులు రైస్‌మిల్లర్లతో కుమ్మ క్కై మాయం చేస్తున్నారని ఆరోపించారు. మొక్కజొన్న రైతులు తూకాలు ఆలస్యం కావడంతో నష్టపోతున్నారని, గన్నీ సంచులు కూడా ప్రభుత్వం అందించలేక రైతులనే కొనుక్కోమని చెప్పడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. హమాలీలు, లారీలు లేవనే పేరుతో రైతులనే పనులు చేసుకోమని చెప్పడం బాధ్యతారాహిత్యమన్నారు. ప్రజా ప్రతినిధులు వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని హితవు పలికారు. గతంలో అనుమతులు లేకుండా ఇటుకబట్టీలకు మట్టి తరలించిన వారే ఇప్పుడు విమ ర్శలు చేస్తున్నారన్నారు. స్థానిక అవసరాల కోసం తీసు కొచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ రవాణా జరుగుతోందని, నిజాయితీ ఉంటే అక్ర మ మట్టి, ఇసుక దందాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. అప్పన్నపేటలో రైతుల ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు వచ్చినప్పుడు తానే స్వయంగా ప్రతీ మిల్లుకు లారీలు పంపించి రైతులకు అండగా నిలిచానని గుర్తు చేశారు. రాజ కీయ లబ్ధి కోసం అసత్య ప్రచారాలు మానుకుని నిజానిజాలు తెలుసుకుని మా ట్లాడాలని, రైతులపక్షాన ఎప్పటికీ నిలబడతానని మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతుల క్షేమం కోరేవారైతే వెంటనే ధాన్యం కొనుగోళ్ళు చేయాలని, చెరువు, మట్టి, ఇసుకలో అక్రమాలకు పాల్పడకపోతే రోడ్డుపై ఒక్క లారీ కూడా తిరుగవద్దని సూచించారు. పార్టీ మండల అధ్యక్షుడు మర్కు లక్ష్మన్, టౌన్ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, పెంచాల రఽశీధర్, వెన్నం రవీందర్, మోబిన్, రమేష్, తిరుపతిరెడ్డి, రామస్వామి, తదితరులున్నారు.