Share News

రోడ్డు ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణం

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:14 AM

రోడ్డు ప్రమాదాలకు మానవ తప్పిదాలే ముఖ్య కారణమని కరీంనగర్‌ పోలీస్‌కమిషనర్‌ గౌస్‌ ఆలం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ’ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక‘లో భాగంగా, కరీంనగర్‌ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, మున్సిపల్‌, రవాణా శాఖ సమన్వయంతో స్థానిక కొత్తపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని రేకుర్తి చౌరస్తాలో ‘అరైవ్‌ అలైవ్‌‘ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.

రోడ్డు ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణం
మాట్లాడుతున్న పోలీస్‌కమిషనర్‌ గౌస్‌ ఆలం

కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాలకు మానవ తప్పిదాలే ముఖ్య కారణమని కరీంనగర్‌ పోలీస్‌కమిషనర్‌ గౌస్‌ ఆలం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ’ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక‘లో భాగంగా, కరీంనగర్‌ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, మున్సిపల్‌, రవాణా శాఖ సమన్వయంతో స్థానిక కొత్తపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని రేకుర్తి చౌరస్తాలో ‘అరైవ్‌ అలైవ్‌‘ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ ధరించకపోవడం, డ్రంకెన్‌డైరవ్‌, మొబైల్‌ ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం, అపసవ్య మార్గాల్లో ప్రయాణించడం, ట్రాఫిక్‌ నియమాలు పాటించకపోవడం ప్రమాదాలకు ముఖ్య కారణాలుగా తెలిపారు. కార్యక్రమంలో కొత్తపల్లి స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ ట్రైనీ ఐపీఎస్‌ సోహం సునీల్‌, ట్రాఫిక్‌ ఏసీపీ యాదగిరిస్వామి, ఇన్‌స్పెక్టర్లు బిల్లా కోటేశ్వర్‌, సంజీవ్‌, కుమారస్వామి, కార్పొరేటర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని మొగ్ధుంపూర్‌, నగునూర్‌ గ్రామాలలో కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు మంగళవారం రోడ్డుప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ ఏ నిరంజన్‌రెడ్డి, ఎస్‌ఐలు నరేష్‌, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2026 | 12:14 AM