హెచ్‌పీవీ వ్యాక్సిన్ లక్ష్యం పూర్తి చేయాలి
ABN , Publish Date - Apr 26 , 2026 | 12:37 AM
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశా లకు అనుగుణంగా జిల్లాలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యం మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశా లకు అనుగుణంగా జిల్లాలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యం మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం సాయం త్రం వైద్యఅరోగ్య, జిల్లా సంక్షేమ, జిల్లాపంచాయతీరాజ్‌శాఖల అధికా రులతో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, టీబీ నిర్దారణ, ఎస్‌సీడీ పరీక్షలు, అంగన్‌వాడీ, పీహెచ్‌సీ భవనాలు, టాయిలెట్ల నిర్మాణాలు చైల్డ్ సేఫ్టీ వీక్, ఎంటీపీ యాక్ట్ తదితర అంశాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ టీబీముక్ల్ భారత్ లో భాగంగా వంద రోజుల కార్యాచరణ కింద జిల్లాలోని 42 గ్రామా ల్లో మొబైల్ ఎక్స్‌రే యంత్రం ద్వారా ఇప్పటివరకు 24 గ్రామాల్లో టీబీ నిరార్ధణ పరీక్షలు పూరిచేశారని మిగిత గ్రామాల్లో ప్రణాళిక ప్రకారం పరీక్షలు పూర్తి చేయాలని అదేశించారు. టీబీ కేసులు నమోదయ్యే గ్రామాల్లో పారిశుధ్యం పనులు ప్రత్యేకంగా చేయించాలని టీబీ భాధితుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి మందులు ఇవ్వాలని పోషకాహారం తీసుకునే లా అవగాహన కల్పించాలన్నారు.
భవన నిర్మాణాల్లో వేగం పెంచాలి
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రాఽథమిక ఆరోగ్యకేంద్రం, హెల్ల్ సబ్ సెంటర్ అంగన్‌వాడీ భవనాల్లో మూత్రశాలల నిర్మాణ పను ల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం పనుల్లో వేగం పెంచి జూన్‌లోగా నిర్మాణాలను పూర్తిచేయాలని సూచిం చారు. డీసీ హెచ్‌ఎస్ ఆధ్వర్యంలో జిల్లాలోని వేములవాడ ఏరియా ఆసు పత్రి, ఎల్లారెడిపేట, గంభీరావుపేట, పీహెచ్‌సీలో ఓపీ నమోదు ఇన్ పేషంట్ ఇతర అంశాలపై ఆరాతీసి వైద్యులకు పలు సూచనలు చేశారు. ఎంటీపీ యాక్ట్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ప్రభు త్వ ఆదేశాల మేరకు చైల్ట్‌సేఫ్టీ వీక్ ఈనెల 27వ తేదీ నుంచి నిర్వహిం చాలని సూచించారు. షెడ్యూల్‌కు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిం చి ప్రభుత్వ సంక్షేమ శాఖ పథకాల, సేవలపై అవగాహన కల్పించాలని సూచించారు. మిషన్ వాత్సల్యపై అంగన్‌వాడీ టీచర్‌లు ఆయాలు అవగా హన కల్పించి అర్హులైన వారి వివరాలు సేకరించి జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిన ఆర్‌వో ప్లాంట్లు బిగించి వినియోగంలోకి తీసుకురావాలని, ప్లే యింగ్ మెటీరీయల్ పిల్లలకు అడుకునేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో పంచాయత్‌రాజ్ ఎస్‌ఈ గీరిష్‌బాబు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, జీజీహెచ్ సూపరింటెం డెంట్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్, డీసీహెచ్ రవీందర్ పాల్గొన్నారు.