Share News

మందకొడిగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌

ABN , Publish Date - Jul 01 , 2026 | 01:16 AM

బాలికలను క్యాన్సర్‌ మహమ్మారి నుంచి రక్షించేందుకు చేపట్టిన కార్యక్రమం అపోహల అడ్డంకులను దాటలేకపోతోంది.

మందకొడిగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌

జగిత్యాల, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): బాలికలను క్యాన్సర్‌ మహమ్మారి నుంచి రక్షించేందుకు చేపట్టిన కార్యక్రమం అపోహల అడ్డంకులను దాటలేకపోతోంది. వేల రూపాయాల విలువైన టీకాను ఉచితంగా అందిస్తున్నప్పటికీ వేసుకోవడానికి చాల మంది ముందుకు రావడం లేదు. దీంతో ప్రాణాంతక గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నుంచి ఆడపిల్లలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. మహిళల్లో గర్బాశయ ముఖద్వారా క్యాన్సర్‌తో పాటు మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. ఇందు కొరకు హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. 14 సంవత్సరాల బాలికలకు ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ వల్ల బాలికలకు సంబంధిత వైరస్‌ నుంచి దీర్ఘకాల రక్షణ లభిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.

ఫఅవగాహన కరువు..

ప్రాణాంతక క్యాన్సర్‌ నుంచి రక్షణ కల్పించే టీకా విషయంలో ప్రచారం కరువైంది. ఈ వ్యాక్సిన్‌పై ప్రజలకు సరియైున అవగాహణ లేకుండా పోయింది. చాలా మంది టీకా వేయిస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అపోహలో ఉన్నారు. ఈ విషయంలో ప్రజల సందేహాలను తీర్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ సరియైున చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి.

ఫ18 శాతం మాత్రమే...

జిల్లాలో 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు వయస్సు గల బాలికలు 10,225 మంది ఉన్నారు. వీరందరికి వ్యాక్సిన్‌ వేయాలని వైద్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యేడాది మార్చిలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ సమయంలో పరీక్షలు ఉండడం, ఆ తర్వాత వేసవి సెలవులు రావడంతో విద్యార్థినులు అందుబాటులో లేకుండా పోయారు. దీనికి తోడు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అపోహలు వ్యాపించాయి. ఈ టీకా వేయిస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయనే తప్పుడు ప్రచారాల వల్ల తల్లి దండ్రులు తమ కూతుళ్లను టీకా వేయించేందుకు ముందుకు రావడం లేదు. జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటి వరకు కేవలం 3,789 మంది మాత్రమే వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. జిల్లాలో వ్యాక్సినేషన్‌ 37.05 శాతం మాత్రమే పూర్తయింది. 14 సంవత్సరాల 3 నెలల వయస్సు దాటిన వారి వివరాల నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో వారికి టీకా వేయలేకపోతున్నారు.

వ్యాక్సినేషన్‌ తీసుకోవాలి

-సుజాత, డీఎంహెచ్‌వో

అర్హత వయసున్న ప్రతి బాలిక హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తీసుకోవాలి. ఇది సర్వైకల్‌ క్యాన్సర్‌ రాకుండా చూస్తుంది. టీకా పూర్తిగా సురక్షితమైనది. తల్లిదండ్రులు వదంతులు నమ్మవద్దు. పిల్లలకు దగ్గరుండి టీకాలు ఇప్పించాలి. వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. జిల్లాలో లక్ష్యం చేరుకోవడానికి కృషి చేస్తాం.

జిల్లాలో వ్యాక్సినేషన్‌ వివరాలు..

---------------------------------------------------------------------------------

పీహెచ్‌సీ/యూహెచ్‌సీ.....లక్ష్యం...వేసుకున్నవారు

---------------------------------------------------------------------------------

ఒడ్డెలింగాపూర్‌ - 709 - 186

మేడిపల్లి - 511 - 137

కల్లెడ - 853 - 282

గొల్లపల్లి - 496 - 130

మల్యాల - 579 - 220

కొడిమ్యాల - 365 - 218

నేరెళ్ల - 784 - 211

సారంగాపూర్‌ - 495 - 155

పెగడపల్లి - 538 - 126

వెల్గటూరు - 292 - 190

అంబారిపేట (న్యూ) - 284 - 94

అయిలాపూర్‌ - 811 - 321

కథలాపూర్‌ - 213 - 132

అంబారిపేట - 239 - 94

జగ్గసాగర్‌ - 521 - 269

మల్లాపూర్‌ - 599 - 184

ఇబ్రహీంపట్నం - 431 - 273

మోతేవాడ - 382 - 112

జెఎస్‌రామ్‌వెల్‌ - 272 - 102

ఖిల్లా గడ్డ - 290 - 143

అల్లమయ్యగుట్ట - 297 - 116

మెట్‌పల్లి - 264 - 94

---------------------------------------------------------------------------------

మొత్తం - 10,225 - 3,789

---------------------------------------------------------------------------------

Updated Date - Jul 01 , 2026 | 01:16 AM