ఉన్నవి ఎన్ని..? లేనివి ఎన్ని..?
ABN , Publish Date - Oct 10 , 2026 | 01:02 AM
నూతన కలెక్టరేట్‌లోకి కార్యాలయాల తరలింపు ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ నెల 12 తర్వాత కొత్త కలెక్టరేట్‌లో పలు శాఖలు కొలువుదీరనున్నాయి. ఆయా శాఖలకు నూతన కలెక్టరేట్‌లో కార్యాలయాలు కేటాయించారు. ‘తమకు కొత్త కలెక్టరేట్‌లో కార్యాలయం కేటాయించాలనే’ వినతులు జిల్లా కలెక్టర్ దృష్టికి ఇంకా వస్తున్నాయి. ఇప్పటి వరకు అద్దె భవనాల్లో అరకొర వసతుల నడుమ నెట్టుకొస్తున్న చాలా కార్యాలయాల హెచ్‌వోడీలు తమకు ఛాంబర్‌తో పాటు స్టాఫ్ గదులను అందించాలని విన్నవిస్తున్నారు.
502కేఎన్‌ఆర్09
503, 504- పాత కలెక్టరేట్‌కు తెస్తున్న రికార్డులు తెస్తున్న సిబ్బంది
ఉన్నవి ఎన్ని..? లేనివి ఎన్ని..?
- ప్రభుత్వ కార్యాలయాల సామగ్రి లెక్కింపు
- 12 తర్వాత కొత్త కలెక్టరేట్‌లోకి పలు శాఖలు
- కార్యాలయాల కేటాయింపుపై తర్జనభర్జన
- ఇలా పాత కలెక్టరేట్‌లోని భూరికార్డులు సర్వే శాఖలోని ఓ కుర్చీకి మరమ్మతు చేయి స్తున్నారు. ఈ విభాగంలో గత కొన్నేళ్లుగా ఉపయోగిస్తున్న కుర్చీలు, టేబుళ్లు, ఫ్యాన్‌లు ఇతర ఫర్నిచర్ వివరాల్ని లెక్కిస్తూ ఉన్నతాధికారులకు వాటి వివరాల్ని అందిస్తున్నారు. వాడుకలో ఉన్నవెన్ని.. వృథాగా పడి ఉన్నవి ఎన్ని అనే సమాచారం క్రోడీకరిస్తున్నారు. కొత్తగా కలెక్టరేట్‌లోకి తరలించే సామగ్రి ఏమిటనే విషయాన్ని కలెక్టరేట్ పరిపాలన విభాగం అధికారులకు నివేదిక రూపంలో అందిస్తున్నారు. పాడైనవాటి వివరాల్ని తెలుపుతూ వాటిని స్టోర్ రూమ్‌లకు తరలిస్తున్నారు.
- ఇలా.. ప్రస్తుత పాత కలెక్టరేట్‌లోని రెవెన్యూ విభాగాల పరిధిలోని కార్యాలయ గదిలో ఫైళ్లను తరలింపునకు సిద్ధంగా కట్టలుగా కట్టి పెట్టారు. ప్రస్తుతం పాత భవనంలో ఉన్న కలెక్టర్, అదనపు కలెక్టర్లు, డీఆర్వో, ఏవో కార్యాలయాలతో పాటు మొత్తంగా ఇక్కడ ఉన్న 16 కార్యాలయాలను కొత్త భవనంలోకి మారుస్తున్నారు. అందుకనే కొత్త భవనంలోకి అవసరమైన సామగ్రిని మాత్రమే తీసుకెళ్లాలని ఆచి తూచి లెక్కలేస్తున్నారు. వీటన్నింటిలో నిరుపయో గంగా ఉండే వాటిని స్ర్కాప్ కింద జమచేస్తున్నారు. కొత్త కార్యాలయంలో అవసరమైన ఫర్నిచర్‌ను ఆయా శాఖల్లో ఉన్న బడ్జెట్ ఆధారంగా కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైన ఇండెంట్‌లను రూపొందిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్)
నూతన కలెక్టరేట్‌లోకి కార్యాలయాల తరలింపు ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ నెల 12 తర్వాత కొత్త కలెక్టరేట్‌లో పలు శాఖలు కొలువుదీరనున్నాయి. ఆయా శాఖలకు నూతన కలెక్టరేట్‌లో కార్యాలయాలు కేటాయించారు. ‘తమకు కొత్త కలెక్టరేట్‌లో కార్యాలయం కేటాయించాలనే’ వినతులు జిల్లా కలెక్టర్ దృష్టికి ఇంకా వస్తున్నాయి. ఇప్పటి వరకు అద్దె భవనాల్లో అరకొర వసతుల నడుమ నెట్టుకొస్తున్న చాలా కార్యాలయాల హెచ్‌వోడీలు తమకు ఛాంబర్‌తో పాటు స్టాఫ్ గదులను అందించాలని విన్నవిస్తున్నారు. అయితే వీటి కేటాయింపు విషయంలో గడిచిన వారం రోజులుగా అదనపు కలెక్టర్ల పర్యవేక్షణలో డీఆర్వో ఇతర అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. పక్క జిల్లాల్లో ఏఏ కార్యాలయాలున్నాయనే విషయాన్ని ఇప్పటికే వాకబు చేశారు. అక్కడి పరిస్థితికి ఇక్కడి జిల్లాలోని పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉండటం.. ఆయా కార్యాలయాల అద్దె భారాన్ని తగ్గించా లనే ఉద్ధేశ్యంతో ప్రైవేటు భవనాల్లో ఉన్న వాటికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొన్నింటికి గదులను కేటాయించగా ఇంకొన్నింటి విషయంలో మల్లగుల్లాలు తప్పడంలేదు. ఆయా శాఖల తరపున రాష్ట్రస్థాయి అధికారుల నుంచి కూడా ఈ భవనంలో కేటాయింపు విషయంలో ఒత్తిళ్లు వస్తుండటంతో ఆచితూచి ఖరారు చేస్తున్నారు. ముందుగా ఖరారు చేసిన రెవెన్యూ ఇతర విభాగాలు మాత్రం ఈ నెల 12నుంచి కొత్త సముదాయంలోకి మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని కొత్త కలెక్టరేట్‌లోనే నిర్వహించనున్నారు.
రికార్డుల తరలింపుపై జాగ్రత్తలు
ఆయా శాఖలకు సంబంధించిన అన్ని రికార్డులను చాలా జాగ్రత్తగా కొత్త చోటుకు తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ చిత్రామిశ్రా అధికారుల్ని ఆదేశించారు. వీటి తరలింపు బాధ్యతను ఓ సీనియర్ అధికారి పర్యవేక్షణలో చేపట్టాలని సూచించారు. అయితే ఇప్పుడున్న పాత దస్ర్తాల్లో చాలా వరకు పాడైనవే ఉండగా వాటిని అతి కష్టంగా వస్ర్తాల్లో చుట్టి పదిల పరుస్తున్నారు. రెండేళ్ల కిందట పాత కలెక్టరేట్ భవనాన్ని కూల్చిన సమయంలో చాలా రికార్డులు మాయమయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. సమాచార హక్కు చట్టం ప్రకారం అర్జీదారులు పలు రికార్డులు లేవనే సమాధానాన్ని కీలకమైన శాఖల విషయంలో అందుకు న్నారు. ముఖ్యంగా రెవెన్యూ, ల్యాండ్ రికార్డ్స్ విభాగాల దస్ర్తాల విషయంలో అత్యంత జాగ్రత్త లు తీసుకోవాల్సిన అవసరముంది. ఏఏ రికార్డులు ఎన్ని ఉన్నాయనే విషయంలో జాబితాను రూపొందించుకుంటే మాయమయ్యే అవకాశం ఉండదు. అలా కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహ రించినా.. లేదా ఇది అవసరం లేదనే విధంగా కొన్ని పత్రాలను పక్కన పడేసినా మొదటికే మోసమొచ్చే వీలుంది. అందుకనే పక్కాగా పరవేక్షణలో వీటి తరలింపు బాధ్యతాయుతంగా జరగాలి.