Share News

హాస్టల్‌ సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Sep 02 , 2026 | 12:30 AM

శాతవాహన యూనివర్సిటీలో హాస్టల్‌, మేస్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా విద్యార్థులు మాట్లాడుతూ హాస్టల్‌ మెస్‌ బిల్లులు తప్పనిసరిగా చెల్లించాలని, లేదంటే సామగ్రి తెచ్చుకుని వంట చేసుకోవాలని అధికారులు అనడం సరికాదన్నారు.

హాస్టల్‌ సమస్యలు పరిష్కరించాలి
ఎస్‌యూ గేటు ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థులు

గణేశ్‌నగర్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): శాతవాహన యూనివర్సిటీలో హాస్టల్‌, మేస్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా విద్యార్థులు మాట్లాడుతూ హాస్టల్‌ మెస్‌ బిల్లులు తప్పనిసరిగా చెల్లించాలని, లేదంటే సామగ్రి తెచ్చుకుని వంట చేసుకోవాలని అధికారులు అనడం సరికాదన్నారు. యూనివర్సిటీ హాస్టల్‌ సమస్యలపై వీసీ, రిజిస్ట్రార్‌ స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మెస్‌ గ్రాసరీస్‌ ధరలను ఇష్టానుసారంగా పెంచి విద్యార్థులపై ఆర్థిక భారం మోపుతున్నారని ఆరోపించారు. దీనిపై ప్రశ్నించినా అధికారులు సరైన సమాధానం ఇవ్వడం లేదన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం, హాస్టల్‌లోని మౌలిక సమస్యలను పరిష్కరించడం కంటే కోట్ల రూపాయల అభివృద్ధి పనులపై దృష్టి పెట్టడం సమంజసం కాదన్నారు. 10 కోట్లతో గ్రౌండ్‌, 5 కోట్లతో గ్యాలరీ, 60 లక్షలతో జిమ్‌ వంటి అభివృద్ధి పనులపై చూపుతున్న శ్రద్ధను 24/7 గంటలు లైబ్రరీ నిర్వహణ, హాస్టల్‌ మెస్‌ సమస్యల పరిష్కారంపై పెట్టాలని డిమాండ్‌ చేశారు. మెస్‌ బిల్లులు, గ్రాసరీస్‌ ధరల పెంపుపై స్పష్టత ఇవ్వడంతోపాటు హాస్టల్‌ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఎస్‌యూ వీసీ ఉమేష్‌కుమార్‌ మాట్లాడుతూ ధర్నాలు, నిరసనలు చేస్తే సమస్యలు పరిష్కారం కావన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు సిబ్బంది, విద్యార్థులతో కలిపి 11 మందితో కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

Updated Date - Sep 02 , 2026 | 12:30 AM