తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారులు
ABN , Publish Date - Oct 31 , 2026 | 11:56 PM
కొత్తపల్లి మండలంలోని బద్దిపల్లి, కొండాపూర్, రామడుగు మండలంలోని గుండి గ్రామాల్లో కూరగాయల, పందిరి, బంతి పూల క్షేత్రాలను జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జగన్మోహన్‌రెడ్డి శనివారం పరిశీలించారు.
భగత్‌నగర్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): కొత్తపల్లి మండలంలోని బద్దిపల్లి, కొండాపూర్, రామడుగు మండలంలోని గుండి గ్రామాల్లో కూరగాయల, పందిరి, బంతి పూల క్షేత్రాలను జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జగన్మోహన్‌రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వరికి ప్రత్యామ్నాయంగా స్వల్పకాలిక పంటలైన కూరగాయలు, పూలు సాగుచేయాలన్నారు. బీర, కాకర, దొండ వంటి తీగ జాతి కూరగాయల సాగును ప్రోత్సహించడానికి సిమెంట్, రాతి స్తంభాలతో శాశ్వత పందిరి నిర్మాణానికి ఉద్యాన శాఖ ద్వారా ఎకరానికి లక్ష రూపాయల సబ్సిడీ అందజేస్తామన్నారు. సబ్సిడీపై డ్రిప్ పరికరాలు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి కె స్వాతి, ఉద్యాన విస్తరణ అధికారి ప్రభాకర్ రైతులు పాల్గొన్నారు.