Share News

నగరంలో హోలీ సంబరాలు

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:22 AM

చంద్ర గ్రహణం కారణంగా రెండోరోజు బుధవారం నగరంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

నగరంలో హోలీ సంబరాలు

కరీంనగర్‌ కల్చరల్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): చంద్ర గ్రహణం కారణంగా రెండోరోజు బుధవారం నగరంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పలు డివిజన్లు, మండలాలు, గ్రామాల్లోని వీధులన్నీ రంగుల మయమయ్యాయి. ఉత్సాహంతో అన్ని వర్గాల ప్రజలు రంగులు తీసుకొని వీధుల్లోకి వచ్చారు. కుర్ర కారు బైకులపై షికారు చేస్తూ రంగులను చల్లుకున్నారు. తెలంగాణచౌక్‌లో 64వ డివిజన్‌ కార్పొరేటర్‌ పడాల శ్రీజ, అజయ్‌ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. మంకమ్మతోట 45వ డివిజన్‌లో కార్పొరేటర్‌ గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సంబరాలు జరాగాయి. జ్యోతీనగర్‌ కెమిస్ట్రు భవన్‌ వద్ద కమల్‌ కిషోర్‌ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో బ్రిజ్‌గోపాల్‌ ముందడా, కిషోర్‌ ముందడా, నందకిషోర్‌ ముందడా, లడ్డు ముందడా, మహేశ్‌ ముందడా, వేణుగోపాల్‌ కార్వా పాల్గొన్నారు.

ఫ మంత్రి పొన్నం క్యాంప్‌ కార్యాలయం వద్ద..

కరీంనగర్‌ అర్బన్‌: కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నగరంలోని మంత్రి పొన్నం ప్రభాకర్‌ క్యాంపు కార్యాలయం వద్ద హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్‌, పర్వతాల మల్లేశం, డీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ బీసీ సెల్‌ జిల్లా చైర్మన్‌ పులి ఆంజనేయులుగౌడ్‌, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నారెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ ఎస్‌టీ సెల్‌ అధ్యక్షులు శ్రావణ్‌ నాయక్‌ పాల్గొన్నారు.

ఫ టీఎన్‌జీవోస్‌ ఆధ్వర్యంలో..

సుభాష్‌నగర్‌: టీఎన్‌జీవోస్‌ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు, ఉద్యోగులు కలిసి రంగులు చల్లుకుంటూ, డాన్సులు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అక్కడి నుంచి మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ నివాసానికి వెళ్లి ఆయనకు హోలి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్‌జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మెన్‌ దారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర జేఏసీ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌, కార్యదర్శి సంగెం లక్ష్మణ్‌రావు, అసోసియేట్‌ అధ్యక్షుడు ఒంటెల రవీందర్‌రెడ్డి, కోశాధికారి ముప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డి, గూడ ప్రభాకర్‌రెడ్డి, రాగి శ్రీనివాస్‌, సర్దార్‌ హర్మిందర్‌సింగ్‌, పట్టణ అధ్యక్షుడు రాజేశ్‌భరద్వాజ్‌, కార్యదర్శి వెలిచాల సుమంత్‌రావు, రూరల్‌ అధ్యక్షుడు కోడూరి వాస్తవిక్‌గౌడ్‌, కార్యదర్శి కొమ్మెర శ్రీనివాస్‌రెడ్డి, తిమ్మాపూర్‌ అధ్యక్షుడు పోలు కిషన్‌, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోట రామస్వామిపాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 12:22 AM