Share News

దేశ వ్యతిరేక శక్తులతో భారత్‌ సమ్మిట్‌ సరికాదు

ABN , Publish Date - Nov 15 , 2026 | 12:16 AM

దేశ వ్యతిరేక శక్తులతో హైదరాబాద్‌లో భారత్‌ సమ్మిట్‌ను నిర్వహించడం దారుణమని భారతీ య జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశ వ్యతిరేక శక్తులతో భారత్‌ సమ్మిట్‌ సరికాదు

సిరిసిల్ల అర్బన్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : దేశ వ్యతిరేక శక్తులతో హైదరాబాద్‌లో భారత్‌ సమ్మిట్‌ను నిర్వహించడం దారుణమని భారతీ య జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని అం బేద్కర్‌ చౌరస్తాలో శనివారం బీజేపీ జిల్లా కమి టీ ఆధ్వర్యంలో నాయకులు భారత్‌ సమ్మిట్‌కు వ్యతిరేకంగా రాస్తారోకో చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, టౌన్‌ సీఐ శ్రీనివాస్‌లు పోలీసులతో అక్కడికి చేరుకుని రాస్తారోకో చేస్తున్న నాయకులను బల వంతంగా రాస్తారోకోను విరమింపజేశారు. అయి తే అంబేద్కర్‌ విగ్రహం ఎదుట కాంగ్రెస్‌ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు నాయకులు తీసుకవస్తుండగా పోలీసులు అడ్డుకున్నా మున్సి పల్‌ కార్యాలయం సమీపంలో దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గోపి మాట్లా డుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, అభివృద్ధి సాధిం చడం లక్ష్యంగా భారత్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్నా మని చెబుతున్నారని, గతంలో నిర్వహించిన గ్లోబల్‌ సమ్మిట్‌తో రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు, ఎంతమందికి ఉపాధిని కల్పించారో ప్రజలకు స్ప ష్టంగా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాం డ్‌ చేశారు. భారత్‌ సమ్మిట్‌ పేరుతో విదేశాల నుంచి భారతదేశాన్ని వ్యతిరేకించే, దేశ సమగ్ర తను ప్రశ్నించే శక్తులకు ఆహ్వానాలు పలకడం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడం, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ దీనికి మద్దతు తెలప డం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రజలకు వివరించా లన్నారు. దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే వ్యక్తులకు అంతర్జాతీయ వేదిక కల్పించడం ఎంతవ రకు సమంజసమ న్నారు. రాష్ట్ర అభివృ ద్ధికి, పెట్టుబడుల రాకకు, పరిశ్రమల ఏర్పాటుకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశా రు. బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్య దర్శి సంటి మహే ష్‌, పార్లమెంట్‌ కో- కన్వీనర్‌ ఆడెపు రవీందర్‌, జిల్లా ప్రధాన కార్యద ర్శులు పొన్నాల తిరుపతిరెడ్డి,సిరికొండ శ్రీనివాస్‌, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఉడుగుల యాదగిరి, ప్రధాన కార్యద ర్శి వంతడ్పుల సుధాకర్‌, కిసాన్‌ మోర్చా అధ్యక్షు డు అన్నాడి జలపతిరెడ్డి, ఎస్టీ మోర్చా అధ్యక్షు డు కిరణ్‌ నాయక్‌, మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షేక్‌ సాబీర్‌, ధార్మిక సెల్‌ కన్వీనర్‌ డాక్టర్‌ సత్య నారాయణ, మండలాల అధ్యక్షులు సౌల్ల క్రాంతి, కోడె రమేష్‌, లకుపతినాయక్‌, మోకిలే విజయేం దర్‌, బాలాజీ, శ్రీధర్‌రావు తదితరులున్నారు.

Updated Date - Nov 15 , 2026 | 12:16 AM