వ్యవసాయ రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం
ABN , Publish Date - Nov 28 , 2026 | 11:54 PM
వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రజా ప్రభు త్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ప్రభు త్వ విప్, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ అన్నారు.
తంగళ్లపల్లి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రజా ప్రభు త్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ప్రభు త్వ విప్, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులోని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ, ఆత్మ శాఖలు సంయుక్తంగా కిసాన్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలె క్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బీ గితేలు హాజరయ్యారు. తెలంగాణ సాంస్కృతి క సారఽథి కళాకారుల ఆధ్వర్యంలో సూపర్ ఎల్‌నినో ప్రభావం, ఇబ్బందులపై పాటల ద్వారా వివరించారు. అలాగే వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సంద ర్శించి ఉపయోగాలు తెలుసుకున్నారు. నిర్వా హకులను అభినందించారు. ఈసందర్భంగా సాగులో నూతన పద్ధతులు పాటిస్తూ వరికి బదులుగా కూరగాయలు, పూలు ఇతర పంటలు సాగు చేస్తూ ఆదాయం పొందు తున్న పలువురు ఆదర్శ రైతులు తమ అను భవాలను వివరించారు. వారిని సన్మానించి వారి సేవలను కొనియాడారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాటుపడు తున్నారని అన్నారు. రైతు పంటించిన ప్రతి గింజకు మద్ద తు ధర కల్పించడంతో పాటు రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభు త్వం లక్ష్యమన్నారు. సన్న వడ్ల సాగును ప్రోత్సహించేందుకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు. ముఖ్య మంత్రి నాయకత్వంలో రూ. 20.650 కోట్లతో 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు ఏక కాలంలో రుణమాఫీ చేశామన్నారు. రైతుల కు గతంలో నిలిచిపోయిన వ్యవసాయ సబ్సి డీలను తిరిగి అందుబాటులోకి తీసుకొస్తూ సుమారు 37రకాల పరికరాలను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరి స్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గా యని అందుబాటులో ఉన్న నీటివనరులను బట్టి పంజల సాగు ప్రణాళిక రూపొందించు కోవాలన్నారు. తాగునీటికి మొదటి ప్రాధాన్య త ఇస్తూనే రైతులకు సాగునీటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుం టోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశా లకు అనుగు ణంగా కిసాన్ మేళా ఏర్పాటు చేస్తున్నామని ఆత్మ చెర్‌పర్సన్, కలెక్టర్ గరి మ అగ్రవాల్ తెలిపారు. వివిధ శాఖ ఆధ్వ ర్యంలో దాదాపు 40 స్టాల్స్ ఏర్పాటు చేశామ న్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉన్న నీటిని ఆరుతడి పంటల సాగుకు వినియోగించాలని, నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్‌పామ్ సాగుచేయాలని కోరారు. ఆదర్శ రైతులు, ప్రజాప్రతినిధులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సేవలు నూతన టెక్నాలజీ విషయాలు నేర్చుకునేం దుకు కిసాన్ మేళాలాంటి కార్యక్రమలు దోహదపడుతాయని ఎస్పీ మహేష్ బీ గితే అన్నారు. సమాచార బదిలీకి ఉపయోగపడు తయాన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయ ణగౌడ్, ఆత్మ కమిటీ సిరిసిల్ల, వేములవాడ డివిజన్ల చైర్మన్లు రాజిరెడ్డి, ముకుందరెడ్డి, మార్కెట్ చైర్మన్లు సత్తు శ్రీనివాస్‌రెడ్డి, హమీ ద్, మహేష్‌రెడ్డి, ప్యాక్స్ చైర్మన్లు బండి దేవ దాస్, కొడూరి భాస్కర్‌గౌడ్, జిల్లా వ్యవసా య శాఖ అధికారి ఆప్జల్‌బేగం, జిల్లా మత్స్య శాఖాధికారి సౌజన్య, జిల్లా పశుసంవర్థక అధికారి రవీందర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ రాజ్ శాఖాధికారి వీరభద్రయ్య, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ స్వప్న, ఉద్యానవన శాఖాధికారి శరత్‌కుబాబు, సీపీవో సంపత్ కుమార్, సర్పంచ్‌లు తదితరులు ఉన్నారు.