ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:58 PM
ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు వస్తున్నా యని ఉద్యానశాఖ అధికారి స్వాతి అన్నారు.
చొప్పదండి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు వస్తున్నా యని ఉద్యానశాఖ అధికారి స్వాతి అన్నారు. శుక్రవారం చొప్పదండిలో ఆయిల్‌పామ్ పంట కోతను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యానశాఖ ద్వారా 2023 జనవరిలో నాటిన ఆయిల్‌పామ్ మొక్కల నుంచి ప్రస్తుతం గెల కోత ప్రారంభమైందని, చొప్పదండికి చెందిన రైతు సోమ మల్లారెడ్డి ఎనమిది ఎకరాల తోట నుంచి ఇప్పటివరకు మూడు కోతల్లోనే 8 టన్నుల దిగుబడి వచ్చిందని తెలిపారు. లక్షా 94 వేల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఆయిల్‌పామ్ టన్ను ధర 23,488గా ఉందని తెలిపారు. రైతులు సాగుకు ముందుకు రావాలని ఆమె కోరారు.