ఆయిల్‌పామ్ సాగుతో అధిక ఆదాయం
ABN , Publish Date - May 06 , 2026 | 12:30 AM
ఆయిల్‌పామ్ సాగుతో రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ రూరల్, మే 5(ఆంధ్రజ్యోతి) : ఆయిల్‌పామ్ సాగుతో రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఉద్యానవన శాఖ అధ్వర్యంలో మంగ ళవారం వేములవాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహిం చిన రైతు అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి చేసుకోవాలని, ఆయిల్‌పామ్ పంటకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అం దజేస్తుందన్నారు. ఆయిల్‌పామ్ పంట తక్కువ శ్రమతో ఎక్కువ ఆదా యం తెస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కంరాజు, వైస్ చైర్మెన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మెన్ కనికరపు రాకేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్‌బాబు, వ్యవసాయ శాఖ అధికా రులు, ఆయిల్‌పామ్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.