కూనారం వడ్లకు ఫుల్ డిమాండ్
ABN , Publish Date - Oct 26 , 2026 | 01:14 AM
పెద్దపల్లి జిల్లా కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రం రూపొందిం చిన కూనారం 1638 సన్న వరి రకానికి మార్కెట్లో ఆదరణ లభిస్తోంది. ఈ రకంతో తయారైన బియ్యానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో మంచి డిమాండ్ పెరుగుతుండటంతో వ్యాపారులు నేరుగా రైతులను సంప్రదిస్తు న్నారు. కోతలు పూర్తయిన వెంటనే ధాన్యాన్ని సంచుల్లో నింపి తరలించ డం కంటే ఒకటి రెండు రోజులు ఆరబెట్టి, తేమ తగ్గిన తర్వాత నిల్వ చేసుకోవాలని సూచిస్తున్నారు.
- కొనుగోలు చేస్తున్న మూడు రాష్ర్టాల వ్యాపారులు
- ప్రభుత్వ మద్దతు ధరకన్నా అధికంగా చెల్లింపు
పెద్దపల్లి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రం రూపొందిం చిన కూనారం 1638 సన్న వరి రకానికి మార్కెట్లో ఆదరణ లభిస్తోంది. ఈ రకంతో తయారైన బియ్యానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో మంచి డిమాండ్ పెరుగుతుండటంతో వ్యాపారులు నేరుగా రైతులను సంప్రదిస్తు న్నారు. కోతలు పూర్తయిన వెంటనే ధాన్యాన్ని సంచుల్లో నింపి తరలించ డం కంటే ఒకటి రెండు రోజులు ఆరబెట్టి, తేమ తగ్గిన తర్వాత నిల్వ చేసుకోవాలని సూచిస్తున్నారు. అలా చేస్తే మరింత మెరుగైన ధర ఇస్తా మని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో రైతులు కూడా ధాన్యాన్ని ఆరబెట్టి విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వరి కోతల సీజన్ ప్రారంభంలో పచ్చి వడ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం వరి కోతలు అన్ని జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. పచ్చి వడ్డకు బదులు ఆరబెట్టిన ధాన్యానికి క్రమక్రమంగా డిమాండ్ పెరుగుతూ వస్తోంది.
ఫ కూనారం 1638కు ప్రత్యేక గుర్తింపు....
కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసిన కూనారం 1638 సన్న వరి రకం తక్కువ కాలంలోనే చేతికి వస్తుండటం రైతులకు కలిసివస్తోంది. ఈ రకం సుమారు 120 నుంచి 125 రోజుల్లో కోతకు సిద్ధమవుతుందని, అనుకూల పరిస్థితుల్లో ఎకరాకు 30 నుంచి 35 క్విం టాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా కాండం తొలిచే పురుగు, అగ్గి తెగులు వంటి సమస్యలను తట్టుకునే లక్షణాలు ఉండటంతో సాగుదారుల్లో ఆసక్తి పెరుగుతోంది. తెగుళ్ల ప్రభా వం తగ్గి, దిగుబడి నిలకడగా ఉండే అవకాశాలు రైతులకు భరోసానిస్తు న్నాయి. ఈ రకం బియ్యానికి వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో ఇతర ప్రాంతాల వ్యాపారులు పెద్దపల్లి జిల్లా వైపు చూస్తున్నారు.
ఫ వ్యాపారుల చూపు పెద్దపల్లి వైపు...
తెలంగాణలో పండుతున్న సన్నవడ్లను కొనుగోలు చేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు కర్ణాటక వంటి పలు దక్షిణాది రాష్ట్రాల వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కూనారం 1638 వంటి రకాలతో తయారయ్యే బియ్యానికి డిమాండ్ ఉండటంతో స్థానిక మిల్లర్లు, వ్యాపారుల ద్వారా ధాన్యం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో కోతలు పూర్తయిన వెంటనే పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించే పరిస్థితి ఉండేది. అయితే తేమ ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని సంచుల్లో నింపి దూర ప్రాంతాలకు రవాణా చేస్తే వేడి పెరిగి, ధాన్యం నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆరబెట్టి, తేమ తగ్గిన తర్వాత నిల్వ చేయాలని, నాణ్యతను బట్టి అధిక ధర చెల్లిస్తామని వ్యాపారులు చెబుతున్నారు.
ఫ మద్దతు ధర కంటే బయటే ఎక్కువ...?
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్‌కు 2470 రూపాయల మద్దతు ధర లభిస్తుంది. అయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో సన్నవరి రకాలకు ప్రైవేటు వ్యాపారులు అంతకంటే ఎక్కువ ధర చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. ఇటీవలి వరకు పచ్చి వడ్లకే రూ.3500 చొప్పున చెల్లించి కొనుగోలు చేశారు. నాణ్యమైన, ఎండిన ధాన్యానికి క్వింటాల్‌కు రూ.4000 చొప్పున కూడా కొనుగోలు చేస్తున్నారు.
ఫ ఆరబెట్టండి.. నాణ్యత కాపాడండి...
పంట కోసిన వెంటనే ధాన్యాన్ని సంచుల్లో నింపి నిల్వ చేయడం కంటే, ఆరబెట్టి తేమ తగ్గిన తర్వాత నిల్వ చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ధాన్యాన్ని నేలపై పరదాలు లేదా టార్ఫాలిన్లపై ఆరబెట్టాలి. వర్షం, రాత్రి మంచు నుంచి కాపాడాలి. కూనారం 1638 వంటి స్థానికంగా అభివృద్ధి చేసిన రకాలకు ఇతర రాష్ట్రాల్లోనూ ఆదరణ పెరగడం పెద్దపల్లి జిల్లా వ్యవసాయానికి సానుకూల పరిణామం.