Share News

హైకోర్టు తీర్పుతో కుట్రలకు తెర..

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:39 AM

కాళేశ్వరం ప్రాజెక్టుపై అపోహ లు, కుట్రలతో తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్‌ను దోషిగా చేయాలనే ప్రయత్నాలు హైకోర్టు తీర్పుతో పటాపంచలైందని, కుట్రలకు తెరపడిం దని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి జీవన్‌రెడ్డి అన్నారు.

హైకోర్టు తీర్పుతో కుట్రలకు తెర..

సిరిసిల్ల, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి) : కాళేశ్వరం ప్రాజెక్టుపై అపోహ లు, కుట్రలతో తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్‌ను దోషిగా చేయాలనే ప్రయత్నాలు హైకోర్టు తీర్పుతో పటాపంచలైందని, కుట్రలకు తెరపడిం దని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి జీవన్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ ఎస్‌లో చేరిన తర్వాత తొలిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌కు రావడంతో ఆయనను పార్టీ నాయకులు ఘనంగా స్వాగతించారు. అనంతరం విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లా డుతూ జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదిక ఆధారంగా కేసీఆర్‌, హరీష్‌రావులపై చర్యలు తీసుకోవద్దని పేర్కొనడం రేవంత్‌ రెడ్డికి చెంపపెట్టులాంటిదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణలో ప్రాణ హిత నదిపై తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మించడానికి సంకల్పించారని గుర్తుచేశారు. అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీ 148 అడుగుల ఎత్తు మాత్రమే పెంచుకునే విధంగా నిబంధన పెట్టిందన్నారు. ఆ ప్రాజెక్టు వద్ద కేవలం 60 టీఎంసీలు మాత్రమే నీరు లభిస్తుందని అంచనాలు వేశారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్‌ మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించడం ద్వారా 300టీఎంసీల నీళ్లు లభిస్తాయని, గోదావరి జలాలు తెలంగాణను సస్యశ్యామలం చేయడంతో పాటు హైదరాబాదుకు కూడా నీటి అవసరాలకు ఉపయోగపడుతుందని అన్ని అనుమతులతో ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు. ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉంటేనే పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నిధులు ఇస్తుందని గుర్తు చేశారు. రూ.4వేల కోట్లతో మేడిగడ్డ వద్ద ప్రపంచం గుర్తించే స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, అందులో రెండు పిల్లర్లు కుంగిన వాటికి రూ.400 కోట్లతో మరమ్మతులు చేయవచ్చన్నారు. రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో చెప్పినా తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణంలో చిత్తశుద్ధి చూపలేదన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్‌ మరమ్మతులు చేపట్టకుండా కేసీఆర్‌ను దోషిగా చేసే కుట్ర జరిగిం దన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 30మాసాలు అవుతున్న తుమ్మిడిహట్టిని పట్టించుకో కుండా హైడ్రా పేరుతో పేదల ఇళ్లు తొలగిస్తున్నా రన్నారు. బఫర్‌ జోన్‌లో పెద్దవాళ్ల ఇళ్ల జోలికి వెళ్లడం లేదన్నారు. కేసీఆర్‌ జగిత్యాలకు రావడంతోనే రేవంత్‌రెడ్డి నిద్రలేచాడని అన్నారు. మేడిగడ్డకు వచ్చి మరమ్మతులు సంబంధించి సూచనలు చేయకుండా రాజకీయ వేదికగా మలచుకొని మాట్లాడడం జరిగిందని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి ప్రజలను ఆశల పల్లకిలో ఊరేగించాడని. కేసీఆర్‌ రూ.200 నుంచి రూ.2 వేలకు పింఛన్‌ పెంచాడని, రేవంత్‌రెడ్డి పింఛన్‌ రూ 4 వేలు ఇస్తానని ఇవ్వలేదన్నారు. అలాగే కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారంవంటి హామీలు నేరవేర్చలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ అభివృద్ధి తీరొగమ నం వైపు వెళుతోందన్నారు. తెలంగాణకు భవిష్యత్తు కేసీఆర్‌ అని కొనియాడారు. సిరిసిల్లను కేటీఆర్‌ అగ్రగామిగా నిలిపారన్నారు. తాను నలుగురు ముఖ్యమంత్రు లను చూశానని, రెండేళ్లకే రేవంత్‌రెడ్డి వద్దు కేసీఆర్‌ రావాలని, ఈ ముఖ్యమంత్రి వద్దనే మాటలు ఎక్కడ చూడలేద న్నారు. రేవంత్‌ కళ్లు మూసుకుటే కేసీఆర్‌ కళ్లలో కనిపిస్తున్నాడన్నారు. ప్రతిపక్షం ఎంత పరిడవిల్లితే అంత సమర్థవంతగా పాలకపక్షం పని చేస్తుందని అన్నారు. అదృష్టవశాత్తు కరువు రాలేదని రాబోయే రోజుల్లో కరువు వస్తే రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య నాస్కా బ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ చక్రపాణి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ అరుణ, మాజీ వైస్‌చైర్మన్‌ సిద్ధం వేణు, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, కార్యదర్శి మ్యానరవి, సెస్‌ డైరక్టర్‌ దార్నం లక్ష్మీనారాయణ, మున్సిపల్‌ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 12:39 AM