జనపనార ఉత్పత్తులను ప్రోత్సహించాలి
ABN , Publish Date - Feb 28 , 2026 | 11:51 PM
జనపనార ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని జడ్పీ సీఈవో శ్రీనివాస్ అన్నారు.
భగత్‌నగర్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): జనపనార ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని జడ్పీ సీఈవో శ్రీనివాస్ అన్నారు. నగరంలోని కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ జూట్ బోర్డ్ (ఎన్‌జేబీ) జూట్ మార్క్ ఇండియా (జేఎంఐ) పథకాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనపనార ఉత్పత్తుల తయారీదారులు ఈ పథకం కింద నమోదు చేసుకోవాలన్నారు. రిజిస్టర్ చేసుకున్న సంస్థలు తమ ఉత్పత్తులపై జేఎంఐ లేబుల్స్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీఆర్డీవో రవికుమార్, డీపీఎం సుధారాణి, డాక్టర్ కేఎస్ మురళీధర్, సంతోష్‌షిండే పాల్గొన్నారు.