నిరుద్యోగ యువతకు చేయూత
ABN , Publish Date - Mar 19 , 2026 | 01:12 AM
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికల్పన కోసం ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది.
- ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాయితీపై టూ వీలర్లు, ఆటోలు
- వ్యవసాయానికి సోలార్ పంపు కంట్రోల్ యూనిట్లు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికల్పన కోసం ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 కింద ఈ స్వయం ఉపాధి పథకాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. బ్యాంకు లింకేజీతో రవాణా, వ్యవసాయ రంగంలో స్వయం ఉపాధి పొందే వారికి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. స్విగ్గీ, జోమాటో తదితర సంస్థల్లో పనిచేస్తూ స్వయం ఉపాధి పొందుతున్న గిగ్ వర్కర్లకు ఈసారి ప్రాధాన్యమిస్తోంది. వీరికి రాయితీపై టూ వీలర్లను, రవాణా కోసం ఉపయోగించే త్రీ వీలర్ ఎలక్ర్టిక్ వాహనాలను సమకూర్చాలని నిర్ణయించింది. వ్యవసాయం ద్వారా ఉపాధి కల్పించుకునే వారికి సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తారు.
ఫ 24 వరకు దరఖాస్తుల స్వీకరణ
వివిధ యూనిట్ల కోసం ఆసక్తి ఉన్న యువతీ యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈనెల 17న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా 24వ తేదీ వరకు వాటిని స్వీకరిస్తారు. ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్‌లో ్టజౌఛఝఝట.ఛిజజ.జౌఠి.జీుఽ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే వారికి ఆధారు కార్డ్, రేషన్ కార్డ్, కుల, ఽఆదాయ ధృవపత్రాలు అవసర ముంటుంది. ఎలక్ర్టానిక్ వాహనాల కోసం దరఖాస్తు చేసుకునేవారు శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి. సోలార్ పంపు కంట్రోల్ యూనిట్ ఏర్పాటు చేసుకునేవారికి రెండు ఎకరాల భూమి కలిగి ఉండి పట్టాదారు పుస్తకం ఉండాలి. ఆ వ్యవసాయ క్షేత్రంలో బోర్‌వెల్ ఉన్నట్లు, నీటి లభ్యత ఉన్నట్లు గ్రామ కార్యదర్శి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవలసి ఉంటుంది. దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్ జతపరచాలి. పాస్‌పోర్టు సైజు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలి. గడిచిన ఐదేళ్లలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందినవారు ప్రస్తుతం ఆర్థిక సహాయం పొందడానికి అనర్హులు. జిల్లాలో అర్హులైన నిరుద్యోగ ఎస్సీ యువతీ యువకులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో తమను సంప్రదించాలని కార్పొరేషన్ ఇన్‌చార్జి అధికారి తిరుపతిరావు తెలిపారు.
ఫ జిల్లాకు కేటాయించిన యూనిట్లు
జిల్లాలో ఈ సంవత్సరం 173 ఎలక్ర్టిక్ ద్విచక్రవాహనాలకు ఆర్థిక సహాయం అందిస్తారు. వాహనం విలువ లక్ష రూపాయలు కాగా 90 శాతం ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. 10 శాతం డబ్బు లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది.
- 85 ఎలక్ర్టిక్ ఆటో ప్యాసింజర్, గూడ్స్ వాహనాలకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఒక్కో వాహనం విలువ మూడు లక్షలు కాగా, 70శాతం రాయితీ ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 30 శాతం లబ్దిదారుడు చెల్లించాలి.
- 18 సోలార్ యూనివర్శల్ పంపు కంట్రోల్ యూనిట్లకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. ఒక్కో యూనిట్ విలువ మూడు లక్షల నుంచి ఏడు లక్షలు ఉంటుంది. యూనిట్ విలువను బట్టి 5 లక్షల వరకు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. మిగతా సొమ్ము లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. ఈనెల 24 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశమున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. వ్యవసాయేతర పథకానికి దరఖాస్తు చేసుకునే వారు 2025 జూలై 1 నాటికి 21-50 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. వ్యవసాయ ఆధారిత యూనిట్లకు 21 నుంచి 60 సంవత్సరాల వయసు ఉండాలి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి వార్షిక ఆదాయం 1.5 లక్షలు, గ్రామీణేతర ప్రాంతాల్లో రెండు లక్షలకు మించి ఆదాయం ఉండరాదు. బ్యాంకు కాన్సెంట్ తప్పనిసరి ఉండాలి. ఒక రేషన్‌కార్డుపై ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.