శారీరక శ్రమతో ఆరోగ్యం..
ABN , Publish Date - Jan 05 , 2026 | 12:55 AM
శారీరకంగా, మానసికంగా దృఢం గా ఉండాలంటే ప్రతిరోజు అరగంట శారీరక శ్రమ ఉండాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి(డీవైఎస్‌వో)అజ్మీరా రాందాస్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : శారీరకంగా, మానసికంగా దృఢం గా ఉండాలంటే ప్రతిరోజు అరగంట శారీరక శ్రమ ఉండాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి(డీవైఎస్‌వో)అజ్మీరా రాందాస్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఫిట్ ఇండియా మిషన్ లో భాగాంగా ఏర్పాటు చేసిన సండేస్ ఆన్ సైకిల్ ర్యాలీని రాందాస్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా రాందాస్ మాట్లాడుతూ డైరెక్టర్ స్వచ్ఛ్ భారత్ మిషన్, ఇన్‌చార్జి కలెక్టర్ ఆదేశాల మేరకు సైకిల్ ర్యాలీని నిర్వహిస్తున్నా మన్నారు. ఫిట్నెస్ కి డోస్ ఆదా గంట రోజ్ అనే ప్రభుత్వ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రతిరోజు శారీ రక శ్రమకు అవకాశం ఇవ్వాలని, అది సైకిలింగ్, రన్నింగ్, ఇతరత్రా వ్యాయా మాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డిప్యూటీ తహసీల్దార్ భాస్క ర్‌రెడ్డి, వాలీబాల్ అకాడమీ, ఖేల్ ఇండియా సెంటర్ అకాడమీ కోచ్‌లు, వ్యాయా మ ఉపాధ్యాయుడు సురేష్, విద్యార్థులు పాల్గొన్నారు.