ఉద్యోగులందరికి త్వరలో హెల్త్ కార్డులు
ABN , Publish Date - Jan 18 , 2026 | 11:51 PM
రాష్ట్రంలోని ఉద్యో గులు అందరికీ త్వరలో హెల్త్ కార్డులు జారీ చే స్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని ఉద్యో గులు అందరికీ త్వరలో హెల్త్ కార్డులు జారీ చే స్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడలో విప్‌ను టీపీటీఎఫ్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్-2026 క్యాలెండర్‌ను ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా అవిష్కరింప జేశారు. ఈ సంద ర్భంగా విప్ మాట్లాడారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం పట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. టెట్ పరీక్ష గురించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సీనియర్ ఉపాధ్యాయులకు పరీక్ష నుంచి మినహాయింపు చేయించడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుమాల రామానాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య, ఉపాధ్య క్షులు పురం వాసుదేవరావు, మందాడి శ్రీనివాస్‌రెడ్డి, నూగూరి దేవేందర్, కేవి రజినీరాణి, కార్యదర్శులు మైలారం తిరుపతి, చకినాల రామచంద్రం, ఎడ్లకృష్ణ, చైతన్యరెడ్డి, బుస్స రాజేందర్, వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.