Share News

ఉత్సాహంగా ఇంటిదారి,,

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:14 AM

ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు గురువారం ముగిశాయి. ఇప్పటి వరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఉత్సాహంగా ఇంటిదారి,,

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు గురువారం ముగిశాయి. ఇప్పటి వరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఉత్సాహంగా స్వగ్రామాలకు తిరిగి వెళ్లారు. చివరిరోజు జరిగిన కెమిస్ట్రీ పేపర్‌-1, కామర్స్‌ పేపర్‌-1 పరీక్షలకు 543 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్‌, వొకేషనల్‌ విభాగంలో కలిపి 18,954 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా జనరల్‌ విభాగంలో 403, వొకేషనల్‌లో 140మంది మొత్తం 543 మంది గైర్హాజరయ్యారు. జనరల్‌ విభాగంలో 17,296, వొకేషనల్‌లో 1106, మొత్తం 18,402 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు ముగియడంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు హాస్టల్స్‌ను ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లారు. ఆర్టీసీ బస్టాండ్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కిటకిటలాడింది.

Updated Date - Mar 13 , 2026 | 12:14 AM