పారదర్శకంగా భూముల రీ సర్వే నిర్వహించాలి
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:17 AM
భూముల రీ సర్వేను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత పారదర్శకంగా నిర్వహించి ప్రతి భూమికి స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ ఆదేశించారు.
సిరిసిల్ల, జూలై 9 (ఆంరఽధజ్యోతి): భూముల రీ సర్వేను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత పారదర్శకంగా నిర్వహించి ప్రతి భూమికి స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి భూముల రీ సర్వే, నక్ష సర్వే, రెవెన్యూ, సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు స్థలాల కేటాయింపుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత కార్యాలయాల సముదా యంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ-సర్వేను దశలవారీగా చేపడుతోందని తెలిపారు. తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సర్వేతో ప్రతి సర్వే నంబర్‌కు స్పష్టమైన యాజమాన్య హక్కులు నిర్ధారించడంతోపాటు ప్రతి భూమికి ప్రత్యేక భూధార్ యూనిక్ నంబర్ కేటాయించనున్నట్లు తెలిపారు. డీజీపీఎస్ రోవర్స్ జీఐఎస్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రీ సర్వే చేపట్టాలని ఆదేశించారు. రీ సర్వే జరుగుతున్న ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, ఆయా గ్రామసభల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులను భాగస్వాము లను చేయాలని సూచించారు.రీ సర్వేలో రెగ్యులర్ సర్వేయర్లతో పాటు లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. సోమవారం నుంచి సర్వేయర్లు, జూనియర్ అసిస్టెం ట్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందికి బ్యాచ్‌ల వారీగా సమగ్ర శిక్షణ నిర్వహించి అనంతరం అన్ని గ్రామాల్లో రీ సర్వే కార్యక్రమాలు ప్రారంభించాలని ఆదేశించారు. జిల్లాస్థాయిలో కూడా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశిం చారు. రీ సర్వే పూర్తయ్యే వరకు రెగ్యులర్ సర్వేయర్లలో 25 శాతం మందిని రొటేషన్ పద్ధతిలో విధుల్లో వినియోగించాలని తెలిపారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల పనితీరును శాఖ సర్వేయర్లు నిరంతరం పర్యవేక్షించాలని, డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో రీ సర్వే పనులను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో రీసర్వే నాణ్యత తో నిర్వహించాలని, సర్వేలో ఉపయోగించే ఆధునిక పరికరాల వినియోగాన్ని సాంకేతికంగా పర్యవేక్షించే వ్యవస్థ అందుబాటులో ఉందని, వాటిని సమర్థవంతంగా ఉపయోగించాలని సూచిం చారు. రీ సర్వేలో పాల్గొనే లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ప్రభుత్వం గౌరవ వేతనం అందజేస్తుందని తెలిపారు. భూ భారతి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని సూచించారు. త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో, వీర్నపల్లి, తంగళ్లపల్లి, వేములవాడ, రుద్రం గిలో నూతన రెవెన్యూ కార్యాలయాలు, వేములవాడ సబ్ రిజి స్ట్రార్ కార్యాలయం నిర్మాణానికి స్థలాలు గుర్తించాలని ఆదేశిం చారు. వేములవాడలో నక్ష సర్వే నిబంధనల ప్రకారం గడువు లోగా పూర్తి చేయాలని సూచించారు. భూముల రీ సర్వే కోసం కావలసిన సిబ్బంది అందుబాటులో ఉండేలా చూసుకొని పని పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికా రులు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్ బాబు, వేములవాడ మున్సి పల్ కమిషనర్ లోకేష్, సర్వే ఏడీ శ్రీనివాస్, సబ్ రిజిస్ట్రార్లు, రెవె న్యూ అధికారులు సిబ్బంది తదితరులు ఉన్నారు.