Share News

విద్యార్థులతో ముచ్చటించి.. సమస్యలు తెలుసుకొని..

ABN , Publish Date - Mar 25 , 2026 | 11:19 PM

విద్యా రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం కాసిపేట మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాల యాన్ని సందర్శించారు.

విద్యార్థులతో ముచ్చటించి.. సమస్యలు తెలుసుకొని..
కాసిపేటలో కేజీబీవీ విద్యార్థినులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

- కస్తూర్బాగాంధీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌

కాసిపేట, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): విద్యా రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం కాసిపేట మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాల యాన్ని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభు త్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. విద్యా ర్థులకు మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారం, శుద్ధమైన తాగునీటిని అందిం చాలని సిబ్బందికి సూచించారు. విద్యార్ధినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. 8వ తరగతి విద్యార్థినులతో మాట్లాడి పాఠశాలలోని సౌకర్యాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం అదనపు తరగతి గదులు, భోజనశా ల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే పారిశుధ్య పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వహించా లని, మురుగుకాలువల్లో చెత్తను తొలగించాల న్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వేగంగా ని ర్మాణాలు పూర్తిచేసుకునేలా చూడాలని అధికా రులు, పంచాయతీ కార్యదర్శుల కు సూచించారు. లంబాడితండా (కే), ముత్యంపల్లి, సోమగూడెం (కే), పెద్దనపల్లి పంచాయతీల్లో పర్యటించి పారిశుధ్య్ద పనులను పరిశీలించారు. సోమగూడెం (కే)లో పల్లె దవాఖానాను సంద ర్శించి వార్డులు, మందుల నిల్వ లు, పారిశుధ్య నిర్వహణ, రిజిష్ట ర్లను తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. అన్ని మందులను అందుబా టులో ఉంచుకోవాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలుంటాయని తెలిపారు. ప్రజాపాలన- ప్రగతిప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలన్నారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీవో సత్య నారాయణసింగ్‌, ఎంపీవో సప్దర్‌ ఆలీ, సర్పంచు కల్వల శరత, కార్యదర్శులు ఉన్నారు.

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ప్రత్యేక ప్రణాళిక

మంచిర్యాల కలెక్టరేట్‌, మార్చి 25 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ప్రత్యేక ప్రణాళికతో అభి వృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. బుధ వారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలె క్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న ఎస్సీ, ఎస్టీ సమస్యలను పరిష్కరించి బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకో వాలన్నారు. ఇందిర మ్మ ఇళ్ల పథకంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దండేపల్లి లోని పీవీటీజీ, తాండూర్‌లో ఎస్టీ వసతి గృహాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అట్రాసిటీ కేసుల్లో తప్పుడు కేసులు నమోదుచేసిన వాటి వివరాలను స్పష్టంగా రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఫిర్యాదుదారులు చేసిన ఫిర్యాదులో వివరాలు సక్రమంగా ఉన్నట్లయితే సమగ్ర విచారణ చేపట్టి చట్టప రంగా చర్యలు తీసుకో వాలన్నారు. కార్యక్రమం లో ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ మానిటరింగ్‌ కమి టీ రాష్ట్ర సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్‌, డీసీపీ భాస్కర్‌, అదనపు కలెక్టర్లు చంద్రయ్య, శ్రీని వాసరావు, సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, ఏసీపీలు ప్రకాస్‌, కిరణ్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గా ప్రసాద్‌, ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స మానిట రింగ్‌ సభ్యులు, రాజనర్సు తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 25 , 2026 | 11:19 PM