హరహర మహదేవా..శంభో శంకరా..
ABN , Publish Date - Feb 16 , 2026 | 01:15 AM
ఓం నమఃశివాయ...హర హర మహాదేవ..శంభో శంకరా.. అంటూ ఆలయాలు శివనామస్మర మార్మోగాయి.
చందుర్తి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి) : ఓం నమఃశివాయ...హర హర మహాదేవ..శంభో శంకరా.. అంటూ ఆలయాలు శివనామస్మర మార్మోగాయి. చందుర్తి మండలంలోని వివిధ ఆలయాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఎన్గల్ గ్రామంలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఉదయం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నర్సింగాపూర్ మల్లికార్జునస్వామి ఆలయంతో పాటు చందుర్తి, మల్యాల గ్రామంలోని మార్కండేయ స్వామి ఆలయంలో శివునికి రుద్రాభిషేకం నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడపల్లి రాజరాజేశ్వరస్వామివారి ఆలయంతో పాటు వివిధ గ్రామాల్లోని ఆలయాల్లో శివరాత్రి సందర్భంగా ఆయాగ్రామాల ప్రజలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మర్రిగడ్డ శివాలయంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. రాత్రివేళల్లో స్వామివారికి జాగరణ పాటించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఫ ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి : మహా శివరాత్రి వేడుకలు ఎల్లారెడ్డిపేట,వీర్నపల్లి మండలాల్లో ఆదివారం ఘనంగా జరిగాయి. మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లోని శివాలయాలు వేకువజాము నుంచే భక్తులతో కిటకిటలాడాయి. శివ న్మామస్మరణతో మార్మోగాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు అక్కపల్లి, బొప్పాపూర్, గొల్లపల్లి, నారాయణపూర్, రాజన్నపేట తదితర గ్రామాల్లోని ఆలయాల్లో వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ శివపార్వతుల కల్యాణ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. దంపతులు, భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు. భారీ సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ఏఎంసీ చైర్‌పర్సన్ సబేరాబేగం, ఏఎంసీ చైర్మన్ రాములునాయక్, సెస్ డైరెక్టర్లు కృష్ణహరి, మల్లేశం, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డిలు ప్రత్యేక పూజలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఫ గంభీరావుపేట : గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రా మాల్లో మహా శివరాత్రి పర్వదినం సంధర్బంగా శివపార్వతుల కల్యాణ మ హోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ ఆలయంతోపాటు రామాలయం పక్కన బ్రహ్మసూత్ర శివాల యంలో శివపార్వతుల కల్యాణం ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి, కల్యాణ మహోత్సవాన్ని తిలకించి, దర్శించుకున్నారు. మహా శివరాత్రి సందర్భంగా పలు ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడాయి.
ఫ ముస్తాబాద్ : ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు, పోతుగల్, మద్దికుంట, బందనకల్, చీకోడ్, గూడెం, ఆవునూర్ తదితర గ్రామాల్లో మహాశివరాత్రి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. శివరాత్రిని పురస్కరించుకొని ముస్తాబాద్‌లో శివకేశవుల ఆలయం, శివాలయం, మద్ది కుంట శివారులో గల మెట్టు రాజరాజేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున వచ్చిదర్శనం చేసుకున్నారు. శివలింగానికి అభిషేకం చేశారు. భక్తు లు ఉపావాస దీక్షలు చేశారు. మద్దికుంటలో రుద్రాభిషేకాలు, శైవపార్వతీ కళ్యాణ మహోత్సావాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. కళ్యాణం అనం తరం భక్తులు ఒడిబియ్యం, కట్నకానుకలను సమర్పించుకున్నారు. తీర్థప్రసా దాలు స్వీకరించారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ గోద అంజి బాబు, మిరుదొడ్డి శరయ్య, కొండ యాదగిరిగౌడ్, మాజీ ఎంపీపీ జనగామ శరత్‌రావు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఫ ఇల్లంతకుంట : శివరాత్రి పర్వదినం సందర్భంగా మండలంలోని పలు ఆలయాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. ఇల్లంతకుంట, వల్లంపట్ల, అనంతారం, గాలిపెల్లి, అనంతగిరి, జంగమరెడ్డిపల్లె తదితర గ్రామాలలో భక్తులు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించారు. గంగాధర ఆలయంలో స్వామివారి ఎదుర్కోలు సందర్భంగా మహిళలు మంగళహారుతులతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో కళ్యాణ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. వల్లంపట్ల గ్రామంలో హోమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మామిడి రాజు, నేరెళ్ళ విజయ్‌గౌడ్, అరుకాల నవీన్‌కుమార్, వొల్లా రజిత, పండుగు సునిత, బద్దం శేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రమణారెడి, మామిడి సంజీవ్, వైదిక బ్రాహ్మణులు మూగు నాగరాజుశర్మ, చెరుకు పవన్‌శర్మ, విఠల్‌శర్మ భక్తులు పాల్గొన్నారు.
ఫ రుద్రంగి : మండల కేంద్రంలోని వెలసిన శ్రీబుగ్గ రాజరాజేశ్వరస్వా మి కల్యాణం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవ త్సరం శివరాత్రి తెల్లవారు జమున ఈ ఆలయంలో ఉత్సవాలను నీర్వహిం చడం ఆనవాయితీగా వస్తుంది. సందర్బంగా ఆలయాన్ని పూలతో ఈ సంద ర్భంగా ఆలయ కమిటీ చైర్మెన్ పల్లికోండ రెడ్డి మాట్లడూతూ సోమవారం స్వామి వారి జాతర నిర్వహించడం జరుగుతుందని, చుట్టు పక్కల నుంచి వచ్చె భక్తుల కోసం మహఅన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగు తుందాన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గోన్నారు. రుద్రం గి మండలం మానాల గ్రామంలోని శంభు లింగేశ్వర స్వామి కాళ్యాణం ఆది వారం ఘనంగా నిర్వహించారు. ఈ సందార్బంగా స్వామి వారి కళ్యాణంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గోన్నారు.
ఫ బోయినపల్లి : బోయినపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో పూజలు నిర్వహించారు. విలాసాగర్ త్రిలింగ సంగమేశ్వర ఆలయంలో స్వా మివారిని దర్శించుకుని కోడెమొక్కు చెల్లించుకున్నారు. రత్నంపేట గ్రామం లో మహా లింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఫ తంగళ్లపల్లి : తంగళ్లపల్లి మండలంలో మహా శివరాత్రి వేడుకలు భక్తి శ్రధ్దలతో జరుపుకున్నారు. మహ శివరాత్రి పురస్కరించుకుని తాడురు గ్రామంలో శివాలయాన్ని విద్యుత్తు దీపాలతో అలంకించారు. రుద్రాభిషేకం నిర్వహించగా భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే తంగళ్లప ల్లి శివాలయంలో, మార్కండేయ దేవాలయంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించగా బస్వాపూర్‌లో శివపార్వతులను పల్లకిలో ఊరేగించారు. వేలా ది మంది భక్తులు శివుడిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు.