పేదల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది
ABN , Publish Date - Jun 17 , 2026 | 11:51 PM
ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్య మంత్రి రేవంతరెడ్డి పాలనలో పేదల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందని సంక్షే మశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు మార్ అన్నారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
వెల్గటూర్, జూన 17 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్య మంత్రి రేవంతరెడ్డి పాలనలో పేదల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందని సంక్షే మశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు మార్ అన్నారు. బుధవారం వెల్గటూర్ మండల కేంద్రంలో వెల్గటూర్, ఎండపల్లి మండలా లకు చెందిన నలుగురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు, 91మంది లబ్ధిదా రులకు రూ.31లక్షల విలువైన ముఖ్య మంత్రి సహాయనిధి చెక్కులను అంద జేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ మాజీ మంత్రి క్యాంప్ కార్యాలయం కరీంనగర్‌లో అందించే వారని ఇది పేద ప్రజలకు భారంగా ఉండేదని అన్నారు. నేడు ప్రజాప్రభుత్వంలో ధర్మపురి నియోజకవర్గం లోని మండల కేంద్రాల్లోనే లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో ప్రజలకు భారం తగ్గిందన్నారు. మొదటి విడత పంపిణీ చేసిన ఇందిరమ్మ ఇళ్లు పూర్తి కావస్తున్నాయని మరికొన్ని గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. రానున్న రోజుల్లో మరింత మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శేఖర్, అనిల్ కుమార్, పీఏసీఎస్ చైర్మన గోలి రత్నాకర్, వెల్గటూర్, ఎండపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు శైలేంధర్ రెడ్డి, గెల్లు శేఖర్, వెల్గటూర్ సర్పంచల ఫోరం మండల అధ్యక్షుడు కూస లక్ష్మణ్, ఉపసర్పంచల ఫోరం మండల అధ్యక్షుడు ప్రతాప్‌రావు, మహేందర్‌రెడ్డి, ఆర్‌ఐలు రాజేశ్వరి, రాంరెడ్డి, అన్వేష్, వివిధ గ్రామాల సర్పంచలు పాల్గొన్నారు.
- గౌడన్నలకు అండగా నిలుస్తాం..
వెల్గటూర్ మండలం జగదేవ్‌పేట గ్రామంలో ఇటీవల దగ్ధమైన ఈత వనాన్ని మంత్రి లక్ష్మణ్‌కుమార్ బుధవారం పరిశీలించారు. అగ్నిప్రమాదంతో జరిగిన తీరును, నష్టం వివరాలను స్థానిక గౌడ సంఘం నాయకులు మంత్రికి వివరించారు. నష్టపోయిన గౌడన్నలకు ప్రభుత్వపరంగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. జగదేవ్‌పేట గ్రామంలో బైపాస్ రోడ్డు నిర్మాణంతో పాటు పెద్దమ్మ ఆలయంలో బోరుబావి తవ్వించడం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ మిగిలిన పనులు పూర్తిచేయాలని గ్రామస్తులు కోరగా పనులు పూర్తి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.