చేనేత సహకార సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:41 AM
చేనేత పోరు ఏక గ్రీవంగానే ముగిసింది.రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవా రం చేనేత, పవర్‌లూమ్ సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
సిరిసిల్ల, జూన్ 19 (ఆంధ్రజ్యోతి) : చేనేత పోరు ఏక గ్రీవంగానే ముగిసింది.రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవా రం చేనేత, పవర్‌లూమ్ సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 11 సొసైటీలు ఉండ గా ఇందులో ఏడు చేనేత సహకార సంఘాలు, నాలుగు పవర్‌లూమ్ సహకార సంఘాలు ఉన్నాయి. చేనేత సహకార సంఘాలకు చివరిసారిగా 2013లో ఎన్నికలు నిర్వహించారు. వీరి పాలకవర్గం గడువు 2018 సంవత్స రంలో ముగిసింది. ఎన్నికల నిర్వహించకుండా గత ప్రభుత్వ హయాం నుంచి పాలకవర్గాల గడువు పొడి గిస్తూ వచ్చారు. చివరకు ఎన్నికల ప్రక్రియను జిల్లాలో మొదటి విడతలోనే పూర్తి చేశారు. జిల్లాలో 11 సొసై టీల పరిధిలో 321 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లా చేనేత, జౌళి శాఖ ఏడి సంతోష్ కుమార్ పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ మూసింది. 9 మందితో కూడిన పాల కవర్గాలను చేతులెత్తే విధానంతో ఎన్నుకున్నారు. పాలక వర్గాల్లో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించారు. చేనేత సొసైటీ పాలకవర్గాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అభినందించారు. వేములవాడ సొసైటీ అధ్య క్షుడు నాగుల సత్యనారాయణతో పాటు పాలకవర్గాన్ని సన్మానించారు.
కొత్త పాలకవర్గాలు ఇవే..
చేనేత సోసైటీ ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల చేనేత సహకార సంఘం అధ్యక్షుడి గా ఆడెపు భాస్కర్, ఉపాధ్యక్షుడిగా బూర నారాయణ, కార్యదర్శిగా రాపెల్లి దేవదాస్, కోశాధికారిగా గాజుల మల్లేశం, డైరెక్టర్లుగా ఎనగంటి లక్ష్మి, ఎలిగేటి రాజావీరు, బుర్ర రామస్వామి, ఆడెపు పద్మ, రాపెళ్లి లలితలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహేశ్వర చేనేత సొసైటీ అధ్యక్షుడిగా మూషం రాజయ్య, ఉపాధ్యక్షుడిగా వాసాల నరసయ్య, కోశాధికారిగా ఎక్కల్‌దేవి జనార్ధన్, డైరెక్టర్లు గా పోగుల లక్ష్మి, బొడ్డు లక్ష్మి, కన్నం గణపతి, కొక్కుల రామానుజం, దూస సత్యనారాయణ, వెంగళ రవీందర్ లను ఎన్నుకున్నారు జగదాంబ సొసైటీ అధ్యక్షుడిగా ఆడెపు సూర్య, భద్రావతి సొసైటీ అధ్యక్షుడిగా గాలిపెళ్లి సురేష్ కుమార్, సరస్వతి పవరూలూమ్ సొసైటీ అధ్య క్షుడిగా గుండ్లపల్లి గౌతం, భాగ్యలక్ష్మి పవర్‌లూమ్ సొసై టీ అధ్యక్షుడిగా చేరాల సువర్ణ, ఉపాధ్యక్షుడిగా చేరాల పూర్ణచందర్, డైరెక్టర్లుగా మేర్గు లావణ్య, గోక పద్మ, వెంగళ తేజశ్రీ, జిందం సునంద, యెల్లే లక్ష్మీరా జంలను ఎన్నుకున్నారు. శ్రీలక్ష్మీ పవర్‌లూమ్ అధ్యక్షుడిగా చేరాల శ్రీనివాస్, ఉపాధ్యక్షురాలిగా తాటికొండ లలిత, జిందం మధు, యేల్లే భూమేష్, యేల్లే శేఖర్, జిందం సత్తమ్మ, యేల్లే పుష్పలను ఎన్నుకున్నారు. అశో క్ పవరూలూమ్ సొసైటీ అధ్యక్షుడిగా తాటిపాముల దా మోదర్, ఉపాధ్యక్షు రాలిగా తాటిపాము ల విజయ, డైరెక్ట ర్లుగా నాగమణి, రాజు, శ్రీధర్, నారా యణ, సాయికిరణ్‌లను ఎన్నుకున్నారు. వేములవాడ కేంద్రంలో చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా నాగుల సత్యనారాయణ, ఉపాధ్య క్షుడిగా తాటికొండ రాజయ్య, కార్యదర్శిగా పారవెల్లి రాజే శం, కోశాధికారిగా రాపెల్లి దేవదాస్, డైరెక్టర్లుగా దూస రాజేశం, పులి సత్యనారాయణ, తాటి కొండ రామస్వామి, నాగుల విజయపాండురంగం, నాగుల విజయ రామ య్యలను ఎన్నుకున్నారు. కోనరావుపేట మండలం మా మిడిపల్లి చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా కొక్కుల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా గెంట్యాల భూమయ్య, కార్యద ర్శిగా కొక్కుల నరసయ్య, కోశాధికారిగా లగిశెట్టి బక్క య్య, డైరెక్టర్లుగా అల్లే నరసయ్య, బూర్ల శ్రీధర్, కొక్కుల జ్యోతి, మాదాసు లింగయ్య, కొక్కుల గంగవ్వలను ఎన్ను కున్నారు. హనుమాజీపేట చేనేత సొసైటీ అధ్యక్షుడిగా పాలేరు లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడిగా చిలుక రాజేశం, కార్యదర్శిగా బత్తుల పోశెట్టి, కోశాధికారిగా చిలుక కృష్ణ హరి, డైరెక్టర్లుగా కోడం దేవయ్య, కోడం మల్లేశం, ఆడెపు లక్ష్మి, కోడం వెంకవ్వలను ఎన్నుకున్నారు.