Share News

5న చేనేత చైతన్య మహాసభ

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:18 AM

కరీంనగర్‌ జిల్లాకేంద్రంలో ఈనెల 5వ తేదిన నిర్వహించే చేనేత చైతన్య మహాసభను విజయవంతం చేయా లని పద్మశాలి సంఘం నాయకులు, తెలంగాణ చేనేత ఐక్య వేదిక నాయ కులు పిలుపునిచ్చారు.

5న చేనేత చైతన్య మహాసభ

తంగళ్లపల్లి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ జిల్లాకేంద్రంలో ఈనెల 5వ తేదిన నిర్వహించే చేనేత చైతన్య మహాసభను విజయవంతం చేయా లని పద్మశాలి సంఘం నాయకులు, తెలంగాణ చేనేత ఐక్య వేదిక నాయ కులు పిలుపునిచ్చారు. ఆదివారం తంగళ్లపల్లి మండల కేంద్రంలో మా ర్కండేయ దేవాలయంలో తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న చేనేత చైతన్య మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 5వ తేదిన కరీంనగర్‌లోని పద్మశాలి కల్యాణ మండపంలో నిర్వహించే సభలో చేనేత కళాకారులకు, మున్సిపల్‌ చైర్మన్లకు, కౌన్సిలర్లు, మేయర్లు, కార్పోరేటర్లు, చేనేత సహకార సంఘాల కార్యవర్గ సభ్యులకు సన్మానం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్ర మానికి పద్మశాలిలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మోర లక్ష్మీరాజం, చేనేత ఐక్య వేదిక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుజ్జె తార, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంకారపు మహేశ్‌, జిల్లా అధ్యక్షుడు శ్రీగాధ మైసయ్య, సిరిసిల్ల మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఆడెపు చంద్రకళ, పద్మశాలి సంఘం అధ్య క్షుడు రాపెల్లి ఆనందం, యువజన విభాగం అధ్యక్షులు మచ్చ శ్రీనివాస్‌, ఉపాఽధ్యక్షుడు భీమన ఆశోక్‌, ప్రధానకార్యదర్శి మచ్చ అంజనేయులు, సహా యకార్యదర్శి తుమ్మ దేవేందర్‌, సాంస్కృతిక కార్యదర్శి సామల రమేష్‌, యువజన విభాగం సలహాదారులు బండి జగన్‌, నాయకులు సామల గణేష్‌, భీమని అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2026 | 12:18 AM