బో‘నమో’ పెద్దమ్మ తల్లి
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:22 AM
డప్పు చప్పుళ్లు.. నెత్తిన బోనాలు.. జమిడిక వాయిద్యాలు.. పోతురాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు.. వేషధారణలు.. భక్తి పారవశ్యం మధ్య ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లి బోనాల జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
కరీంనగర్ కల్చరల్, జులై 5 (ఆంధ్రజ్యోతి): డప్పు చప్పుళ్లు.. నెత్తిన బోనాలు.. జమిడిక వాయిద్యాలు.. పోతురాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు.. వేషధారణలు.. భక్తి పారవశ్యం మధ్య ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లి బోనాల జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కట్టరాంపూర్, బోయవాడ, భగత్‌నగర్, జ్యోతినగర్‌కు చెందిన బోనాలు పెద్ద సంఖ్యలో భగత్‌నగర్ విగ్రహం వద్ద కలసి పెద్దమ్మతల్లి ఆలయానికి ర్యాలీగా బయలుదేరాయి. ముదిరాజ్ కులస్తులు పసుపు, కుంకుమలు, ఒడిబియ్యం, గాజులు, వస్త్రాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, అన్ని వృత్తుల వారు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. అతిథులుగా ఎంపి ఈటల రాజేందర్, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్‌రావు హాజరు కాగా కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ, నాంపల్లి రేణుక, సంఘ అధ్యక్ష కార్యదర్శులు కొలగాని నరసయ్య, పండుగ నాగరాజు, గౌరవాధ్యక్షుడు పిట్టల లింగయ్య, వెలవేని నరసయ్య, ఉపాధ్యక్షులు కనకయ్య, అంజయ్య, కోశాధికారి లక్ష్మణ్, సహాయ కార్యదర్శులు మహేందర్, రాజయ్య పాల్గొన్నారు.