Share News

జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:57 PM

బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు నునావత్‌ శ్రీనివాస్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు.

జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి
తెలంగాణ చౌక్‌లో నిరసన తెలుపుతున్న ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు

గణేశ్‌నగర్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు నునావత్‌ శ్రీనివాస్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ చౌక్‌వద్ద ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు, కార్యకర్తలు శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్‌ ద్వారా ఓట్ల తొలగింపుపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశంలో 13 కోట్ల మంది ఓట్లను సర్‌ పేరుతో తొలగించడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కసిరెడ్డి సందీప్‌రెడి,్డ నాయకులు గోస్కి దినేష్‌ , కుశ్వహా రాఘవేంద్ర, దీకొండ అక్షయ్‌, అట్ల సిద్దు, రితీష్‌, సుహాస్‌, వరుణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 11:57 PM