Share News

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి

ABN , Publish Date - Oct 12 , 2026 | 11:38 PM

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారుల ను ఆదేశించారు.

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి

సిరిసిల్ల అర్బన్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారుల ను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిం చిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్‌, ఇతర అధికారుల కు వినతిపత్రం అందజేసి పరిష్కరించాలని కోరారు. ఈ ప్రజావాణిలో 129 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని సంబంధిత జిల్లా అధికారులకు అందించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ ప్రజావాణి లో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, జడ్పీ సీఈవో వెంకటమాధవరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, సిరిసిల్ల ఆర్డీవో కార్యా లయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 7, వేములవాడ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 1 దరఖాస్తులు వచ్చాయి. వాటిని సం బంధిత అధికారులకు అందించి పరిష్కరించాలని ఆర్డీవోలు ఆదేశించారు.

తంగళ్లపల్లికి ఎంపీడీవోను నియమించాలి

తంగళ్లపల్లి మండలంలో ఎంపీడీవో లేకపోవడంతో గ్రామాల అభివృద్ధి కుంటు పడడంతోపాటు సమస్యలు పరిష్కారం కావడం లేదని, వెంటనే రెగ్యూల్‌ ఎంపీడీవో ను నియమించాలని తాడూరు మాజీ సర్పంచ్‌ గుర్రం రాజలింగం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు.

కాలనీలో సమస్యలు పరిష్కరించాలి

తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ శివారులోని కేసీఆర్‌నగర్‌లో నెలకొన్న సమస్యలను గ్రామపంచాయతీ పాలకవర్గంతోపాటు అధికారులు పట్టించుకోవడంలేదని, వెంటనే సమస్యలను పరిష్కరించాలంటూ కాలనీ మహి ళలు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమం లో రాగుల రోజా, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

లేబర్‌ ఖర్చులను చెల్లించాలి

గత సీజన్‌లో ఐకేపీలలో సేకరించిన ధాన్యానికి సంబంధించిన లేబర్‌ ఖర్చులను చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే లేబర్‌ ఖర్చులను ఇప్పించాలంటూ ఇల్లంతకుంట మండలానికి చెందిన రైతులు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు. వెంటనే డబ్బులను చెల్లించాలని కలెక్టర్‌ను కోరారు.

వెల్ఫేర్‌ బోర్డును ఏర్పాటు చేయాలి

హమాలీలకు రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్‌ బోర్డును ఏర్పా టుచేయాలని, ధాన్యం క్వింటాల్‌కు రూ.60 చెల్లించాలని, జిల్లాకు రెగ్యూలర్‌ కార్మికశాఖ అధికారిని నియమించా లని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హమాలీలు, కార్మికులతో కలిసి అధ్యక్షుడు ఎల్లారెడ్డి కలెక్టరేట్‌కు తరలివచ్చి కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ను కలిసి వినతిపత్రాన్ని అందించారు. రెగ్యూలర్‌ కార్మిక శాఖ అధికారిని నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు గీస బిక్షపతి, మిట్టపల్లి రాజమౌళి, కోలా శ్రీనివాస్‌, లోకుర్తి రాజు, లోకుర్తి సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2026 | 11:38 PM