Share News

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి

ABN , Publish Date - Oct 06 , 2026 | 12:45 AM

ప్రజా వాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిం చాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశిం చారు.

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి

సిరిసిల్ల అర్బన్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : ప్రజా వాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిం చాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశిం చారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్‌, ఇతర అధికారులకు వినతి పత్రం అందజేసి పరిష్కరించాలని కోరారు. ఈ ప్రజావాణిలో 115 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని సంబంధిత జిల్లా అధికారులకు అందించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, జడ్పీ సీఈవో వెంకటమాధవరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ నిఖి తారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాగా, సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 1, వేములవాడ ఆర్డీవో కార్యా లయంలో నిర్వహించిన ప్రజావాణికి 3 దరఖాస్తులు వచ్చాయి. వాటిని సంబంధిత అధికారులకు అందించి పరిష్కరించాలని ఆర్డీవోలు ఆదేశించారు.

నిలిచిన ఆన్‌లైన్‌ సేవలు...

కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రజావాణిలో ఫిర్యాదులు సమర్పించేందుకు వచ్చిన వారందరు తమ దరఖాస్తులను ముందుగా ఆన్‌లైన్‌ చేసుకుని రసీదు తీసుకుని ప్రజావాణి లో ్లకలెక్టర్‌కు ఇస్తుంటారు. సోమవారం ఆన్‌లైన్‌లో ఫిర్యాదులను నమోదు చేసే కంప్యూటర్‌లు గంటకుపైగా మొరాయిం చడంతో ఆన్‌లైన్‌ దరఖాస్తుల నమోదు ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఫిర్యా దు చేసేందుకు వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆన్‌లైన్‌లో నమోదు చేసు కునేందుకు ఇబ్బందులు పడ్డారు.

Updated Date - Oct 06 , 2026 | 12:45 AM