Share News

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి

ABN , Publish Date - Jul 13 , 2026 | 11:56 PM

ప్రజావా ణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పెండింగ్‌లో పెట్టకుండా జిల్లా అధికారులు పరిష్కరించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి

సిరిసిల్ల అర్బన్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : ప్రజావా ణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పెండింగ్‌లో పెట్టకుండా జిల్లా అధికారులు పరిష్కరించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వచ్చిన బాధితులు కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తోపాటు జిల్లా అధికారులను కలిసి సమస్యలను విన్నవించి ఫిర్యాదులను అందించారు. ఈ ప్రజావాణిలో 202 ఫిర్యా దులు వచ్చాయి. వీటి సంబంధిత జిల్లా అధికారులకు అందించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ అదేశిం చారు. ప్రజావాణిలో ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులను ఎన్ని పరిష్కరించారని అధికారులను అడిగితెలుసుకు న్నారు. ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో పరిష్కరించాలని పెం డింగ్‌లో పెట్టవద్దని ఆదేశించారు. అన్నిశాఖల అధికారు లు, బాధ్యులు తప్పనిసరిగా ప్రజావాణికి హాజరుకావాల ని స్పష్టం చేశారు. ప్రజావాణిలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, జడ్పీ సీఈవో వెంకటమాధవరావు, ట్రైనీ డిప్యూ టీ కలెక్టర్‌ నిఖితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల, వేములవాడలో..

సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజావా ణి నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించా రు. సిరిసిల్ల ఆర్డీవో ప్రజావాణికి 10, వేములవాడ ప్రజా వాణికి 4 దరఖాస్తులు రాగా, సంబంధిత అధికారులకు అందించి పరిష్కరించాలని ఆర్డీవోలు అదేశించారు.

పొలాల మధ్య రోడ్డును ఆక్రమించారు..

సర్దాపూర్‌, జగ్గారావుపల్లె గ్రామాలకు చెందిన తమకు సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని పెద్దూర్‌ శివారులోని పెద్దమ్మ గుడి నుంచి సర్దాపూర్‌ గ్రామశివారు వరకు పూర్వకాలం నుంచి వ్యవసాయ పొలాలకు ఉన్న రోడ్డును ఆక్రమించి పంటలను సాగు చేశారని, దీంతో తాము పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని, కలెక్టర్‌ స్పం దించి సర్వేలు చేయించి రోడ్డును పునరుద్ధరించాలని దొంతినేని అశోక్‌రావు, లచ్చయ్య, రామచంద్రం, దేవేంద ర్‌, రాజేందర్‌, అంజయ్య, దేవయ్య, నర్సయ్య, నాంపెల్లి తదితరులు కోరారు.

మరుగుదొడ్లను నిర్మించాలి..

గంభీరావుపేట మండలం కేంద్రంలోని కేజీ టూ పీజీ పాఠశాలలోని ఎంపీపీఎస్‌ పాఠశాలను అంగన్‌వాడీ భవనంపైకి మార్చడం వలన కనీస సదుపాయాలు, మరుగుదోడ్లు, నీటి సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థు లు ఇబ్బందులు పడుతు న్నారు. గత ఏప్రిల్‌లో చివరిగా జరిగిన పేరెంట్స్‌ మీటింగ్‌లో దీనిపై చర్యలు తీసుకోవాల ని కోరినా ఇప్పటివరకు సౌకర్యాలు కల్పించలేదని, ఇప్ప టికైనా విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలంటూ తల్లిదండ్రులు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు.

నిబంధనలు పాటించని వాటర్‌ ప్లాంట్లు

- సలెంద్రి వేణుగోపాల్‌, యాదవ్‌, పెద్దూర్‌

సిరిసిల్ల పట్టణంలో నిబంధ నలను పాటించని మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లను సంబంధిత అధికారులు పట్టించుకోకపోవ డంతో నిర్వాహకులు ఇష్టానుసా రంగా వ్యవహరిస్తున్నారు. వాట ర్‌ప్లాంట్‌లలో నాణ్యత ప్రమాణా లు పాటించడం లేదు. దీనిపై కలెక్టర్‌ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.

ప్రభుత్వ భూములను కాపాడాలి

- గంధం మధు, రామచంద్రాపూర్‌, తంగళ్లపల్లి

తంగళ్లపల్లి మండలం రామ చంద్రాపూర్‌ గ్రామంలోని ప్రభు త్వ భూములను కాపాడేందుకు కలెక్టర్‌ చర్యలు చేపట్టాలి. ఎలాంటి పట్టాదారు పాసుబుక్‌ లు లేకుండానే సర్వేనంబర్‌ 104 లోని ఉన్న ప్రభుత్వ భూముల ను గ్రామానికి చెందిన గంధం లచ్చయ్య, పొన్నం నవీన్‌, ఆక్రమించుకుని సాగుచేసుకుంటున్నారు. అధికారులు దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను కాపాడాలి.

నష్టపరిహారం ఇప్పించండి..

- గుర్రం రాజయ్య, చింతల్‌ఠాణా, తంగళ్లపల్లి

తంగళ్లపల్లి మండలంలోని చింతల్‌ఠాణా గ్రామంలో నాకు న్న పట్టా భూమి మిడ్‌మానేరు లో ముంపునకు గురికాగా ఇప్ప టివరకు ఎలాంటి నష్టపరిహారం అధికారులు ఇవ్వ లేదు. దీనిపై అఽధికారులను ఎన్నిసార్లు కలిసి విన్నవించినా స్పందించడం లేదు. ఇప్పటికైనా ముంపు భూమికి సంబంధించిన నష్టపరిహారం అందించి నా కుటుంబాన్ని ఆదుకోవాలి.

Updated Date - Jul 13 , 2026 | 11:56 PM