Share News

ఫిర్యాదుల పరిష్కారానికే గ్రీవెన్స్‌ సెల్‌

ABN , Publish Date - Feb 25 , 2026 | 11:37 PM

ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ వేదికగా గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేశామని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా కరీంనగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్‌, గ్రీవెన్స్‌ సెల్‌ను పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం బుధవారం అధికారికంగా ప్రారంభించారు.

 ఫిర్యాదుల పరిష్కారానికే గ్రీవెన్స్‌ సెల్‌

కరీంనగర్‌ క్రైం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ వేదికగా గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేశామని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా కరీంనగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్‌, గ్రీవెన్స్‌ సెల్‌ను పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం బుధవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, సామాన్య ప్రజలు తమ ఫిర్యాదులను నేరుగా అధికారులకు విన్నవించుకునేందుకు గ్రీవెన్స్‌సెల్‌ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ ఉల్లంఘ నలు, వేధింపులు లేదా ఇతర ఇబ్బందులపై ప్రజలు ఇక్కడ నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అలాగే నగరంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రజలు తమ విలువైన సలహాలను, సూచనలను అందించవచ్చన్నారు. చలాన్ల వివరాలు, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన వంటి అన్ని రకాల ట్రాఫిక్‌ సంబంధిత సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయ న్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ వెంకటరమణ, భీంరావు, ట్రాఫిక్‌ ఏసీపీ యాదగిరిస్వామి, ఇన్‌స్పెక్టర్‌ కరీముల్లాఖాన్‌, ఇతర పోలీసు అధికారులు, ట్రాఫిక్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 11:37 PM