Share News

యువత ఉపాధికి సబ్సిడీ రుణాల మంజూరు

ABN , Publish Date - May 24 , 2026 | 12:10 AM

యువతి, యువకులకు ఉపాధి మార్గాల కోసం సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తున్నామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

యువత ఉపాధికి సబ్సిడీ రుణాల మంజూరు

సిరిసిల్ల, మే 23 (ఆంధ్రజ్యోతి) : యువతి, యువకులకు ఉపాధి మార్గాల కోసం సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తున్నామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. శనివారం సిరిసిల్లలోని కే కన్వెన్షన్‌లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జాబ్‌ మేళా ప్రారంభించారు. ఉద్యోగాల పొందిన యువతి, యువకులకు నియామ క పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఎల్లవేళలా యువతకు అండగా ఉంటుందన్నారు. యువతీ, యువకులు పరిశ్రమలు స్థాపించుకోవడానికి ప్రభుత్వం అండగా ఉంద న్నారు. 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో గ్రామం, మండలం, నియో జకవర్గం, జిల్లాస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నామని, జాబ్‌ మేళా లు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పన కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో దాదాపు 70 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. రాష్ట్రంలో గ్రూప్‌-1, టీచర్‌ ఉద్యోగ నియామకాల వంటి అనేక ఉద్యోగాల నియా మకాలు చేపట్టామన్నారు. మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రుణాలు మంజూరు చేస్తామన్నారు.

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లాలోని యువత అవకాశాలను అందిపుచ్చుకుని స్వయం సమృద్ధి తో ముందుకు సాగాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సూచించారు. కేం ద్రంలోని కె కన్వెన్షన్‌లో యువజన, క్రీడావారోత్సవాల సందర్భంగా ఉద్యోగ సాధన అనే అంశంతో జాబ్‌ మేళా నిర్వహించారు. జాబ్‌ మేళా లో 25 వివిధ ప్రైవేట్‌ కంపెనీలు, శిక్షణ సంస్థల ప్రతినిధులు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు. పలు కంపె నీల్లో ఎంపికైన అభ్యర్థులకు కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బి గితే నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత కేవలం విద్యార్హత లతోనే కాకుండా నైపుణ్యాలతో కూడిన సామర్థ్యాలను పెంపొందించుకో వాలని సూచించారు. ప్రభుత్వ శాఖలు, శిక్షణ సంస్థలు కల్పిస్తున్న అవ కాశాలను సద్వినియోగం చేసుకుంటే యువత భవిష్యత్తు మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం యువత కోసం అనేక ఉపా ధి, స్వయంఉపాధి పథకాలను అమలు చేస్తోందన్నారు. ఎస్పీ మహేష్‌ బి గితే మాట్లాడుతూ యువత జీవితంలో క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల ఎంతో ముఖ్యమన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి పని చేస్తే విజయాన్ని తప్పకుండా సాధించవచ్చని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న ప్రస్తుత కాలంలో యువత తమ నైపుణ్యాల ను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్‌సర్సన్‌ స్వరూపరెడ్డి, డీఆర్‌డీవో లక్ష్మీనారాయణ, సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, పరిశ్రమల శాఖ జీఎం హనుమంతు, సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఎల్‌డీ ఎం మల్లికార్జునరావు, యువజన, క్రీడా శాఖ అధికారి రాందాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌ పాషా, మైనారిటీ శాఖ అధికారి భారతి, ఎస్సీ కార్పొ రేషన్‌ ఈడీ స్వప్న, తహసీల్దార్‌ మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2026 | 12:10 AM