చాకలి ఐలమ్మకు ఘన నివాళి
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:28 AM
దొరల పాలనను ధిక్కరించి, వెట్టి చాకిరి, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అన్నారు.
కరీంనగర్ అర్బన్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): దొరల పాలనను ధిక్కరించి, వెట్టి చాకిరి, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం కరీంనగర్ కలెక్టరేట్ రోడ్డులోని ఆమె విగ్రహానికి మంత్రులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాడారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు రాచకొండ నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా గౌరవ అధ్యక్షుడు రాజయ్య, పూసల శ్రీకాంత్, బుత్కురి శివకృష్ణ, పూసాల సంపత్ పాల్గొన్నారు.