ఘనంగా గణేశ రుద్ర హోమం
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:17 AM
నగరంలోని పాతబజార్ గౌరీశంకరాలయంలో ఆదిశంకరాచార్య జయంతి కార్యక్రమాల్లో భాగంగా గణేశ రుద్ర హోమం ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు.
కరీంనగర్ కల్చరల్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): నగరంలోని పాతబజార్ గౌరీశంకరాలయంలో ఆదిశంకరాచార్య జయంతి కార్యక్రమాల్లో భాగంగా గణేశ రుద్ర హోమం ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు కేంద్ర హోం శాఖా సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ జ్యోతిప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఆదిశంకరుల ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలుజరిపారు. కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, ఆలయ అర్చకుడు పురాణం మహేశ్వరశర్మ, వంశపారంపర్య ధర్మకర్త ప్రొద్దుటూరి శ్రీనివాస్, ఈవో వుడుతల వెంకన్న పాల్గొన్నారు.