ఘనంగా పర్యావరణ వారోత్సవాలు..
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:37 AM
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పర్యావరణ వారోత్సవాలను ఘనంగా నిర్వహించడంతోపాటు ఈనెల 4నుంచి 10వ తేదీవరకు గ్రామ, వార్డు సభలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారా వు ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి) : ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పర్యావరణ వారోత్సవాలను ఘనంగా నిర్వహించడంతోపాటు ఈనెల 4నుంచి 10వ తేదీవరకు గ్రామ, వార్డు సభలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారా వు ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర డీజీపీ సీవీఅనంద్ తో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృ ష్ణారావు పర్యావరణ వారోత్సవాలు, వర్షాకా లం సన్నద్ధత, గ్రామ, వార్డు సభల నిర్వహణ పై కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బీగీతేలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పర్యావరణ వారోత్సవా లు విజయవంతంగా నిర్వహించాలన్నారు. అన్ని కార్యక్రమా లను ప్రణాళిక ప్రకారం చేపట్టాలని సూచించారు. ఈనెల 4నుంచి 10వ తేదీలలో గ్రామ, వార్డు సభలను ఏర్పాటు చేసి వివిధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాల న్నారు. ఈ సభలలో ముఖ్యంగా రైతులకు రానున్న వర్షాకా లం, వాతావరణ పరిస్థితులు, పంటల సాగు వంటి అనేక విషయాలను వివరించాలన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. గ్రామ సభల లో మండల స్థాయి అధికారులు మొదలుకొని ప్రజా ప్రతి నిధులు ప్రజలు మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న వర్షాకాలం, ఆకస్మిక వరదలు, విపత్కర పరిస్థితులపై అధి కారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. పోలీసులు, అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు పరస్పరం సమన్వ యంతో ఉండాలని తెలిపారు. ఈ వీడియోకాన్పరేన్స్‌లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. వేములవాడ ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, ఎన్‌పీడీసీఎల్ ఎస్ ఈ వేణుమాధవ్, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, సీపీవో శ్రీని వాసాచారి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ఫుద్దిన్, ఉద్యానవన శాఖ అధికారి శరత్, జిల్లా వైద్యాధికారి రజిత, ఇరిగేషన్ అధికారులు కిశోర్ కుమార్, సంతు ప్రకాశ్, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఖదీర్‌పాషా, లోకేష్, అధికారులు, సిబ్బంది, తది తరులు పాల్గొన్నారు.