ఘనంగా విజయదశమి వేడుకలు
ABN , Publish Date - Oct 22 , 2026 | 12:20 AM
సిరిసిల్ల అర్బన్ పరిధిలోని సర్ధాపూర్‌లోని 17వ పోలీస్ బెటాలియన్‌లో విజయదశమి వేడుకలను మంగళవా రం ఘనంగా చేపట్టారు.
సిరిసిల్ల అర్బన్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల అర్బన్ పరిధిలోని సర్ధాపూర్‌లోని 17వ పోలీస్ బెటాలియన్‌లో విజయదశమి వేడుకలను మంగళవా రం ఘనంగా చేపట్టారు. బెటాలియన్‌లో అయుధాలు, వాహానాలు, ఎస్‌డీఅర్‌ఎఫ్ పరికారలకు ప్రత్యేక పూజ లు చేశారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాం డెంట్ పీజేపీసీ ఛటర్జీ దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేసి జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్‌లు రాందాస్, సంజీవరెడ్డి తదితరలు పాల్గొన్నారు.
కోనరావుపేట : కోనరావుపేట మండల కేంద్రంతో పాటు విజయదశమి సందర్భంగా ఉత్సవాలను మంగ ళవారం ఘనంగా జరుపుకున్నారు. విజయదశమి ఉత్స వాల్లో భాగంగా ముందుగా గ్రామ పెద్దలు పాలపిట్ట ను చూసి జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి ఒకరికి ఒకరు జంబి ఆకులు పెడుతూ అలయ్ బలయ్ తీసు కున్నారు. ఈ విజయదశమి సందర్భంగా ఆయా గ్రామాల్లోని సర్పంచులు అన్ని ఏర్పాట్లు చేశారు.
చెన్నకేశవ స్వామి ఊరేగింపు
కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామిని బుధవారం రథంపై ఊరేగించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని ఊరేగిం చారు. చివరిరోజు బుధవారం స్వామివారిని ఊరేగిం చగా భక్తులు మంగళహారతితో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మంగళగిరి లక్ష్మయ్య, చక్ర పాణి, భక్తులు పాల్గొన్నారు.
ఇల్లంతకుంట : దసరా వేడుకలు మండంలోని ఊరూరా ఘనంగా జరిగాయి. గ్రామాలలోని కూడలి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామ పొలిమేరలో ఏర్పాటు చేసిన జమ్మిచెట్టు వద్దకు వెళ్లా రు. జమ్మి ఆకులను బంగారంగా భావించి ఒకరికొరకు పెట్టుకొని అభినందనలు తెలుపుకున్నారు. కొన్ని గ్రామాల్లో సారగమ్మల వద్ద జంతుబలులు ఇచ్చారు. రక్తాన్ని నుదుటన పెట్టుకోవడానికి, కంకనాల కోసం యువకులు పోటీపడ్డారు. ముస్కానిపేట గ్రామంలో లక్ష్మీనర్సింహస్వామి ఆలయం చుట్టూ షావతిప్పారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై ఉపేంద్రా చారి ఆధ్వర్యంలో పోలీసులు అన్ని గ్రామాల్లో బందో బస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీల పాలకవర్గ సభ్యులు, గ్రామ స్తులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట : విజయ దశమి వేడుకలు ఎల్లారెడ్డిపేట మండలంలో మంగళవారం ఘనంగా జరిగాయి. మండల కేంద్రంతో పాటు గొల్లపల్లి, బొప్పాపూర్, దు మాల, నారాయణపూర్, బండలింగంపల్లి, కోరుట్లపేట, తిమ్మాపూర్, గుండారం, వెంకటాపూర్, హరిదాస్‌నగర్, పదిర, అక్కపల్లి, రాగట్లపల్లి, అల్మాస్‌పూర్, తదితర గ్రామాల ప్రజలు ఉదయం నుంచే వేడుకల్లో మునిగిపోయారు. దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక పోలీస్ స్టేషన్‌లలో సీఐ వెంకటేశ్, ఎస్‌ఐ రమేశ్, సిబ్బంది ఆయుధ పూజ జరిపించారు. గ్రామాల్లో వాహన పూజలు చేసేందుకు ఆలయాల వద్ద వాహనదారులు బారులు తీరారు. ఆయా గ్రామాల్లో సాయం త్రం శమిపూజలు నిర్వహించారు. దేవతామూర్తులను రథంపై ప్రతిష్టించి ఊరేగించారు. ప్రధాన వీధుల గుం డా భక్తిశ్రద్ధల నడుమ స్వామి వారు ముందుకు కదిలారు. మహిళలు మంగళహారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పలు గ్రామాల్లో రావణ దహనం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి రావణ ప్రతిమ నుంచి ఎగిసిన మంటలను వీక్షించారు. గ్రామాల్లో యువతి, యువకులు, మహిళలు దాండియా, కోలాటాలు ఆడారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన స్వగ్రామామైన కోరుట్లపేటలో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలను జరుపుకున్నారు. సీఐ వెంకటేశ్, ఎస్‌ఐ రమేశ్ ఆధ్వర్యంలోని పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. తహసీల్దార్ దివ్యజ్యో తి, ఎంపీడీవో సత్తయ్య, సీఐ వెంకటేశ్, ఎస్‌ఐ రమేశ్, ఏఎంసీ చైర్మన్ దేవానందం, ప్యాక్స్ చైర్మన్లు కృష్ణారెడ్డి, సుధీర్‌రావు, మోహన్‌రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నర్సయ్య, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య, బీజేపీ జల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
బోయినపల్లి : మండలంలోని వివిధ గ్రామాల్లో దస రా పండుగ వేడుకలు వైభవంగా జరిగాయి. మండల వ్యాప్తంగా పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ సందర్భంగా ప్రజలు సంప్రదాయబద్ధంగా శమీ పూజ (జమ్మిపూజ) నిర్వహించి, ఒకరికొకరు అలయ్ బలయ్ తీసుకుంటూ దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
తంగళ్లపల్లి : మండలంలో దసరా వేడుకలు ఘనం గా జరుపుకున్నారు. తంగళ్లపల్లిలో ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వ ర్యంలో శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం ఆవరణలో రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామపం చాయతీ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసింది. ముఖ్య అతిథిగా సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి హాజరయ్యారు. వేలాది మంది తరలివచ్చి రవాణా దహనం కాగానే ఒకరికొకరు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నా రు. అలాగే మండేపల్లి గ్రామంలో రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సీఐ నాగేశ్వరరావు, వరంగల్ టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ సీఈ బుస్స అశోక్, ప్యాక్క్ చైర్మన్ బండి దేవదాస్, సర్పంచ్ లు మోర లక్ష్మీరాజం, గాధగోని సాగర్, ఎస్‌ఐ ఆశోక్, ప్యాక్స్ వైస్‌చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణరెడ్డి, ఉప సర్పంచ్ ఆసాని శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా యువజన సంఘాల సమితి అధ్యక్షులు జాల్గం ప్రవీణ్‌కుమార్, జిల్లా సేవాదళ్ అఽధ్యక్షులు మోర రాజు, ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడు ఎడ్మల శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గంభీరావుపేట : గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో విజయ దశమి వేడుకలను ప్రజలు ఆనందోత్సవాల మద్య జరుపుకున్నారు. కనదుర్గమాతను ప్రజలు భక్తిశ్రద్దలతో పూజించి, అమ్మవారి ఆశీస్సులు దీవెనలు ఉండాలని వేడుకున్నారు. దసరా పర్వదినం సంధర్బంగా పాలపి ట్ట దర్శనం చేసుకుంటూ ఒకరికొకరు పండగ శుభా కాంక్షలు తెలుపుకున్నారు.
చందుర్తి : చందుర్తి కేంద్రంతో పాటు మండలంలో ని అన్ని గ్రామాల్లో మంగళవారం దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. చందుర్తిలో శరన్నవరాత్రులు సందర్భంగా అశ్వవాహనంపై శ్రీసీతారామచంద్రస్వామి శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపం డితులు పవన్‌శర్మ ఆధ్వర్యంలో గ్రామస్తులు శమీ పూ జను నిర్వహించారు. అనంతరం ఒకరికి ఒకరు జంబి పంచుకొని విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నా రు. అనంతపల్లి, అశిరెడ్డిపల్లి, లింగంపేట, మల్యాల గ్రామాల్లో చిన్నచిన్న గొడవలు తలెత్తిన ట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో దుర్గా మాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించా రు. భక్తుల కోలాటాలు, మంగళవాయిద్యాలు, నృత్యాల నడుమ అమ్మవారి శోభాయాత్ర సాగింది. ఎస్‌ఐ రమే ష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
రుద్రంగి : రుద్రంగి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మంగళవారం దసరా వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే గ్రామస్ధులు పలు ఆలయాల వద్ద వాహన పూజలతో పాటు మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం ప్రహ్లాద పర్వతంపై వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆశ్వవాహనంపై జమ్మిచెట్టు వరకు బాజాభజంత్రీల మధ్య శోభాయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారి పల్లకిని మోసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జమ్మిచెట్టు వద్ద ఆయుధ పూజను నిర్వహించారు. సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుప తి, ఉప సర్పంచ్ మాడిశేట్టి ఆభిలాష్, మాజీ జడ్పిటిసి గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రె ప్రభలత మనో హర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎర్రం గంగ నర్సయ్య, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, మంచె రాజేశం, కేసిరెడ్డి నర్సరెడ్డి, కోమిరె శంకర్, సామ మోహన్‌రెడ్డి, నంద్యాడ పు వేంకటేష్, పల్లి గంగాదర్, బండారి నర్సయ్య, ఇప్ప మహేష్, ఎర్రం ఆరవింద్, పోగుల మహేష్, ఆకుల గగన్, చెలుకల శ్రీకాంత్, తదితరులు పాల్గోన్నారు.