Share News

రుద్రంగిలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:15 AM

తెలంగాణ సంస్కృతి, సంప్రాదాయానికి ప్రతీరూపమైన బతుక మ్మ వేడుకలు గురువారం రుద్రంగి మండల కేంద్రం లో కనులపండువగా జరిగాయి.

రుద్రంగిలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు

రుద్రంగి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ సంస్కృతి, సంప్రాదాయానికి ప్రతీరూపమైన బతుక మ్మ వేడుకలు గురువారం రుద్రంగి మండల కేంద్రం లో కనులపండువగా జరిగాయి. రుద్రంగిలో దసరా పండగ అనంతరం బతుకమ్మ వేడుకలు జరగడం అన వాయితీగా వస్తోంది. మహిళలు అందంగా బతుకమ్మ లను పేర్చి గ్రామ ప్రధాన కూడలి అయిన ఇందిరా చౌక్‌, హనుమాన్‌ ఆలయం వద్ద, రామకిష్ణాపూర్‌పల్లె, అంబేద్కర్‌ చౌరస్తా, బస్టాండ్‌ ప్రాంతంలో బతుకమ్మల ను ఉంచి మహిళలు కోలాటలు ఆడారు. అనంతరం గ్రామ శివారులోని బతుకమ్మ చేరువులో బతుకమ్మల ను నిమజ్జనం చేశారు.

పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ

- ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

పూలనే పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ రాష్ట్రా నిదని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మేల్యే ఆది శ్రీని వాస్‌ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో శనివారం జరిగిన బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీని వాస్‌ హాజరై తిలకించారు. కోలాటాల మధ్య బతుకమ్మ వేడుకల్లో ఆది శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్‌ గండి నారాయణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెలుకల తిరుపతి, ఉప సర్పంచ్‌ మాడిశేట్టి అభిలాష్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య, మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య, తర్రె మనోహర్‌, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, సామ మోహన్‌రెడ్డి, కేసిరెడ్డి నర్సరెడ్డి, కొమిరె శంకర్‌, పల్లి గంగాధర్‌, తర్రె లింగం, ఇప్ప మహేష్‌, బొల్లి దేవేందర్‌, ఎర్రం రాజలింగం, ఆకుల గగన్‌, దర్న మల్లేశం, పూదరి మహిపాల్‌, ఏర్రం అరవింద్‌, పుటక్కపు మహిపాల్‌, చెలుకల శ్రీకాంత్‌, రాహుల్‌, కాంగ్రెస్‌ నాయకులు తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2026 | 12:15 AM