ఘనంగా బోనాల వేడుకలు
ABN , Publish Date - Aug 10 , 2026 | 12:41 AM
తెలం గాణ సంస్కృతి సంప్రదా యాలను ప్రతిబింబించే లా మహిళలు ఆదివారం పోచమ్మ, మైసమ్మ, అం బా భవానీ బోనాలను ఘనంగా నిర్వహించారు.
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : తెలం గాణ సంస్కృతి సంప్రదా యాలను ప్రతిబింబించే లా మహిళలు ఆదివారం పోచమ్మ, మైసమ్మ, అం బా భవానీ బోనాలను ఘనంగా నిర్వహించారు. ఆషాఢమాసం చివరి ఆది వారం కావడంతో జిల్లా కేంద్రంలో ఆయా ప్రాంతా ల్లో కొలువైన పోచమ్మ, మైసమ్మ, అంబా భవాని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 39 వార్డుల్లో ఆడపడుచులు అమ్మవార్లకు బోనాలు సమర్పించుకునేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు బారులు తీరారు. మహిళలు వేపాకు లు, పసుపు, కుంకుమలతో అలంకరిం చుకొని బోనాలను నెత్తిన పెట్టుకొని ఆయా దేవాలయాలకు డప్పు చప్పుళ్లు, పోతరాజుల నృత్యాలతో ప్రదర్శనగా బయలుదేరారు. దేవాలయాల్లో అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలను సమర్పించుకొని బెల్లం అన్నం, పెరుగు అన్నం నైవేద్యం పెట్టా రు. ఒడి బియ్యం, చీరెసారే సమ ర్పించుకొని పిల్లపాలను, పాడి పంటల ను చల్లగా చూడాలి తల్లీ అంటూ భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నా రు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు క్యూ కట్టారు. పోచమ్మ దేవాలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. వివిధ వార్డుల కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ ల నాయకులు పాల్గొన్నారు.
కాగా, సిరిసిల్ల పట్టణం విద్యానగర్ శ్రీ అభయాంజనేయ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలను నిర్వహించారు. విద్యానగర్ శ్రీ అభయాంజనేయ దేవాలయం నుంచి పోచమ్మ వీధిలోని పోచమ్మ దేవాల యం వరకు డప్పుచప్పుళ్లతో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి, మహిళలు బోనాలను ఎత్తుకొని ప్రదర్శనగా వెల్లారు. అమ్మవారికి బోనాలను సమర్పించు కొని మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ అభయాంజ నేయు వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు బొల్లి రామ్మోహన్, ప్రధానకార్యదర్శి యెల్లారెడ్డి, కోశాధికారి శేఖర్, సభ్యు లు, మహిళలు పాల్గొన్నారు.