బతుకమ్మ నిమజ్జనానికి ఘనంగా ఏర్పాట్లు
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:14 AM
సిరిసిల్ల పట్టణంతో పాటు విలీన గ్రామాల్లో బతుకమ్మ ఘాట్ల వద్ద నిమజ్జనాల సౌకర్యార్థం రూ.29 లక్షల 50వేల ఏర్పాట్లను చేస్తున్నామని మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి అన్నారు.
సిరిసిల్ల టౌన్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల పట్టణంతో పాటు విలీన గ్రామాల్లో బతుకమ్మ ఘాట్ల వద్ద నిమజ్జనాల సౌకర్యార్థం రూ.29 లక్షల 50వేల ఏర్పాట్లను చేస్తున్నామని మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలోని వివిధ బతుకమ్మ ఘాట్ల వద్ద నిమజ్జనం ఏర్పాట్లను కమిషనర్ ఎండీ ఖాదీర్‌పాషాతో కలిసి చైర్‌పర్సన్ పరిశీలించారు. ఈసందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ తెలం గాణ సంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకునే విధంగా మున్సిపల్ ఆధ్వర్యంలో పలు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా బతుకమ్మ ఘాట్ల వద్ద నిమజ్జనం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహి స్తున్నామని అన్నారు. పారిశుధ్యం, తాగునీటి సౌకర్యాలు, విద్యుత్ దీపాలు, మహిళ భద్రతాపై ఏర్పాట్లను వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మున్సిపల్ పరిధిలో వివిధ వార్డుల్లో రూ.32 లక్షలతో నూతన బతుకమ్మ ఘాట్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ నరసింహస్వామి, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.