స్వాతంత్య్ర వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
ABN , Publish Date - Aug 12 , 2026 | 12:09 AM
జిల్లాలో ఈనెల 15న చేపట్టే స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా, పకడ్బందీగా నిర్వహిం చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయా లని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈనెల 15న చేపట్టే స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా, పకడ్బందీగా నిర్వహిం చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయా లని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగ ళవారం స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై ఎస్పీ మహేష్ బీ గీతేతో కలిసి సంబంధిత శాఖల జిల్లాస్ధాయి అధికారులతో సమావేశా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ స్వాతంత్య్ర వేడుకలకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, తప్పనిసరిగా హాజర య్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ జెండా ఆవిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లు, వేదిక, గ్రౌండ్ తదితర ఏర్పాట్లను పోలీ స్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయం తో పూర్తిచేయాలని సూచించారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా స్టాల్స్, శక టాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశిం చారు. ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్ర మాలు, జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అవగాహన కలి గే విధంగా స్టాల్స్‌లో ప్రదర్శించాలని సూచిం చారు. దేశభక్తిని ప్రతిబింబించేలా విద్యార్థుల తో సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శ నలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పా ట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసేందుకు సంబంధించిన ప్రతిపాదన లను నిర్ణీత గడువులోగా సమర్పించాలని కలె క్టర్ తెలిపారు. స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్య అతిథి ప్రసంగం కోసం జిల్లాలోని వివిధ శాఖలు చేపట్టిన ముఖ్యమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సంక్షిప్త నివేదికలను జిల్లా పౌర సంబంధాల అధికారికి అందజే యాలని ఆదేశించారు. జిల్లాకు చెందిన ప్రముఖులు, వివిధ రంగాల్లో విశిష్ట సేవలం దిస్తున్న వ్యక్తులు వేడుకలకు హాజరయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవా లని కలెక్టర్ సూచించారు. ప్రతి ప్రభుత్వ శాఖ తమ కార్యాలయాల్లో కూడా స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించడంతో పాటు జిల్లా స్థాయి వేడుకలకు అధికారులు, సిబ్బంది హాజరయ్యేలా చూడాలని తెలిపారు. వేడుకల సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. స్వశక్తి మహిళా సంఘాల ప్రతినిధులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలు, అధికారులు, విద్యార్థు లకు అవసరమైన మేర తాగునీటి వసతి ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డీఆర్‌వో జయ శ్రీ, సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, సంబంధిత ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, తదిత రులు పాల్గొన్నారు.