Share News

‘చలో వేములవాడ’కు జీపీ కార్మికులు తరలిరావాలి

ABN , Publish Date - Jun 16 , 2026 | 12:27 AM

గ్రామపంచాయితీ కార్మికుల సమ స్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ చేపట్టిన చలో వేములవాడ కార్యక్రమానికి గ్రామపంచా యతీ కార్మికులు తరలిరావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరా రు.

‘చలో వేములవాడ’కు జీపీ కార్మికులు తరలిరావాలి

సిరిసిల్ల అర్బన్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి) : గ్రామపంచాయితీ కార్మికుల సమ స్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ చేపట్టిన చలో వేములవాడ కార్యక్రమానికి గ్రామపంచా యతీ కార్మికులు తరలిరావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరా రు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని అమృత్‌లాల్‌ శుక్లాకార్మిక భవనంలో సోమ వారం ఏర్పాటు చేసిన సమావేశంలో రమణ మాట్లాడారు. కార్మికుల సమస్య లు పరిష్కరించాలంటూ బుధవారం వేములవాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యం ముట్టడికి జిల్లాలోని 12 మండలాల నుంచి గ్రామ పంచాయతీ కార్మకులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. జీపీ కార్మిక ఎంప్లా యిస్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి అన్నల్‌దాస్‌ గణేష్‌, సీఐటీయూ జిల్లా అధ్య క్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి, సూరం పద్మ పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2026 | 12:27 AM