Share News

కాల వర్షంతో తడిసిన ధాన్యం

ABN , Publish Date - May 04 , 2026 | 12:46 AM

మండలంలోని రాయికల్‌, బొమ్మకల్‌, అమ్మనగుర్తి, నల్లరామయ్యపల్లి గ్రామాల పరిధిలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు, వడగళ్లతో వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది.

కాల వర్షంతో తడిసిన ధాన్యం

సైదాపూర్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రాయికల్‌, బొమ్మకల్‌, అమ్మనగుర్తి, నల్లరామయ్యపల్లి గ్రామాల పరిధిలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు, వడగళ్లతో వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఉదయం నుంచి ఎండ తీవ్రంగా ఉండడంతో వర్షం రాదని అనుకున్నారు. సాయంత్రం అకస్మాత్తుగా మబ్బులుకమ్మి వర్షం కురవడంతో ధాన్యం కుప్ప చేసి టార్పాలిన్లు కప్పలేక పోయారు. వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో నీరు నిలిచి ధాన్యం కిందకు చేరింది. దీంతో రైతులు నీళ్లల్లో నుంచి ధాన్యాన్ని తీసేందుకు ఇబ్బందిపడ్డారు. అకాల వర్షంతో ధాన్యం తడిసిందని, ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఫ హుజూరాబాద్‌లో..

హుజూరాబాద్‌: మండలంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు వీచాయి. పరకాల క్రాస్‌ రోడ్‌ సమీపంలోని బాలాజీ రైస్‌మిల్లుకు సంబంధించిన రేకులు ఈదురుగాలులకు చెల్లచెదురుగా పడిపోయాయి. 1.5 లక్షల రూపాయల నష్టం జరిగిందని మిల్లు నిర్వాహకులు సంపత్‌రావు, మల్లారెడ్డి తెలిపారు. ఆరబోసిన ధాన్యం చిరుజల్లులకు కొంతమేర తడిసింది.

Updated Date - May 04 , 2026 | 12:46 AM