ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ABN , Publish Date - May 28 , 2026 | 12:19 AM
వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.
ఫ కలెక్టర్ సత్యప్రసాద్
ఇబ్రహీంపట్నం, మే27(ఆంధ్రజ్యోతి): వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. మండలంలోని వర్షకొండ, మెట్‌పల్లి మండలం రామలచ్చక్కపేట గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ధాన్యం తూకం, నిల్వ, రవాణా ప్రక్రియల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. ధాన్యం కొనుగోళ్లు చేసిన వెంటనే డాటా ఎంట్రీ ఆన్‌లైన్ చేసి రైతులకు ఖాతాలో డబ్బులు జమయ్యేలా చూడాలన్నారు. మిల్లుల వద్ద త్వరగా అన్‌లోడింగ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి ఆర్డీఓ నరసింహరావు డీసీఎస్‌ఓ జితేందర్ రెడ్డి, తహసిల్దార్‌లు, ఎంపీడీఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.