Share News

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ABN , Publish Date - May 26 , 2026 | 12:40 AM

జిల్లాలో వరి ధాన్యం కొను గోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌ అధికారును ఆదేశించారు. మండలంలోని రామన్నపేట, తక్కళ్ల పల్లి, బల్వంతాపూర్‌లోని కొనుగోలు కేంద్రాలల్లో ధాన్యం కొను గోల్లు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లా డుతూ ధాన్యం తూకం, నిలువ, రవాణా ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని తూకం వేసిన ధాన్యంను సకాలంలో మిల్లులకు తరలించాలని నిర్వహకులతో పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
మల్యాలలో కొనుగోళ్ల వివరాలు పరిశీలిస్తున్న కలెక్టర్‌ సత్యప్రసాద్‌

మల్యాల, మే 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వరి ధాన్యం కొను గోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌ అధికారును ఆదేశించారు. మండలంలోని రామన్నపేట, తక్కళ్ల పల్లి, బల్వంతాపూర్‌లోని కొనుగోలు కేంద్రాలల్లో ధాన్యం కొను గోల్లు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లా డుతూ ధాన్యం తూకం, నిలువ, రవాణా ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని తూకం వేసిన ధాన్యంను సకాలంలో మిల్లులకు తరలించాలని నిర్వహకులతో పేర్కొన్నారు. మిల్లుల వద్ద త్వరగా అన్‌లోడ్‌ చేసుకునేందుకు సంబందిత అధికా రులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ వెంట జిల్లా సివిల్‌ సప్లై అధికారి జతేంధర్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివా స్‌, ఎంపీడీవో స్వాతి, ఆర్‌ఐ తిరుపతి తదితరులు ఉన్నారు.

ధాన్యం మిల్లులకు తరలించాలి

కొడిమ్యాల : ధాన్యం తూకం వేసిన వెంటనె మిల్లులకు తరలించాలని కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌ అన్నారు. సోమవారం మండలంలోని పూడూర్‌, డబ్బుతిమ్మయ్యపల్లి గ్రామాల్లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ అకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులతో మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు ప్రక్రియ పార దర్శంగా నిర్వహించాలన్నారు. ధాన్యం తూకం, నిల్వ, రవాణా లో విషయాలలో నిర్లక్ష్యం ఉండవద్దన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనె డాటా ఎంట్రీ ఆన్‌లైన్‌ చేసి రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యె విదంగా చూడాలన్నారు. మిల్లుల వద్ద ఽత్వరగా దాన్యం అన్‌లోడింగ్‌ చేసుకోవాలన్నారు. కలెక్టర్‌ వెంట డీసీఎస్‌వో జితెందర్‌రెడ్డ్డి, తహసీల్దార్‌ నరేష్‌, ఎంపీడీవో స్వరూప, ఆర్‌ఐ రాజారాం, సిబ్బంది ఉన్నారు.

Updated Date - May 26 , 2026 | 12:40 AM