పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - May 02 , 2026 | 01:15 AM
రైస్‌మిల్లుల సామర్థ్యానికి మించి కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం పంపించకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకవచ్చిన నూతన విధానానికి తాత్కాలికంగా బ్రేకులు వేసింది. ఈ సీజన్ నుంచి కేంద్రాల వారీగా రైస్‌మిల్లుల కేటాయింపు లేకుండా ఆన్ లైన్‌లో రైతుల వివరాలు, వాళ్లు కేంద్రానికి తీసుకవచ్చిన ధాన్యం తూకం వివరాలు నమోదు చేసినవెంటనే జనరేట్ అయిన మిల్లుకే ధాన్యాన్ని పంపించాల్సి ఉంటుంది.
- ఆన్‌లైన్ విధానానికి తాత్కాలికంగా బ్రేక్
- కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండడమే కారణం
- కేంద్రాల వారీగా రైస్‌మిల్లుల కేటాయింపులు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రైస్‌మిల్లుల సామర్థ్యానికి మించి కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం పంపించకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకవచ్చిన నూతన విధానానికి తాత్కాలికంగా బ్రేకులు వేసింది. ఈ సీజన్ నుంచి కేంద్రాల వారీగా రైస్‌మిల్లుల కేటాయింపు లేకుండా ఆన్ లైన్‌లో రైతుల వివరాలు, వాళ్లు కేంద్రానికి తీసుకవచ్చిన ధాన్యం తూకం వివరాలు నమోదు చేసినవెంటనే జనరేట్ అయిన మిల్లుకే ధాన్యాన్ని పంపించాల్సి ఉంటుంది. దీంతో ఆయా రైస్‌మిల్లర్లు సకాలంలో ధాన్యాన్ని మర ఆడించి సీఎంఆర్ కింద బియ్యం పెట్టేం దుకు సంబంధిత అధికారులు పర్యవేక్షించడానికి సులువుగా ఉం టుంది. అధికారులపై రైస్‌మిల్లర్లు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికా రుల నుంచి ఒత్తిళ్లకు లొంగకుండా, అధికారులు సైతం అక్రమా లకు పాల్పడకుండా ఉండేందుకు ఈ విధానం తోడ్పడనున్నదని భావించిన ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుక వచ్చింది.
ఫ నూతన విధానంతో కొనుగోళ్లలో జాప్యం
ఆన్‌లైన్ విధానంలో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగు తుండడంతో పాత విధానంలోనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని నిర్ణయించారు. కొనుగోళ్లలో ఇబ్బందులను గుర్తించిన కేంద్రాల నిర్వాహకులు, రైస్‌మిల్లర్లు అధికారులకు ఎప్పటికప్పుడు పరిస్థితిని వివరించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో ఆన్‌లైన్ విధానం ద్వారా ఎదురవుతున్న ఇక్కట్లను రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లడంతో తాత్కాలికంగా ఆన్‌లైన్ విధానం అమ లుకు బ్రేక్ వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఓపీఎంఎస్ ధాన్యం కొనుగోలు విధానం వల్ల రైతు వివరాలను సిస్టమ్‌లో నమోదు చేసి ఆధార్ కార్డు ద్వారా వారి గుర్తింపును ధ్రువీకరించాల్సి ఉంటుంది. రైతు భూమి విస్తీర్ణం, పండించిన ధాన్యం వివరాలను ఓపీఎంఎస్‌లో సరి చూడాల్సి ఉంటుంది. ధాన్యం పొడిగా, శుభ్రంగా ఉండి ప్రభుత్వ ఎఫ్‌ఏక్యూ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో పరిశీలించాలి, నాణ్యత ఉంటేనే రైతులకు గన్నీ సంచులు అందించాల్సి ఉంటుంది. సంచుల్లో ధాన్యం నింపి కేంద్రం వద్ద తూకం వేయాల్సి ఉంటుంది. రైతు ఆధార్ అథెంటికేషన్ (వేలి ముద్ర లేదా ఓటీపీ) ద్వారా ధాన్యం విక్రయాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. తూకం వేసిన ధాన్యాన్ని జీపీఎస్ కలిగిన ట్రక్కులో లోడ్ చేసి, ఓపీఎంఎస్ ద్వారా ట్రక్ షీట్ జనరేట్ చేయాలి. మిల్లు కేటాయింపు పూర్తిగా ఆటోమెటిక్‌గా చేపడుతోంది. మిల్లర్ ధాన్యా న్ని స్వీకరించి ఓపీఎంఎస్‌లో అక్‌నాలెడ్జ్‌మెంట్ చేయాల్సి ఉం టుంది. మిల్లర్ నిర్ధారణ అనంతరం ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తోంది. అయితే అడుగడుగున ఆన్‌లైన్ విధానంలో పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. సర్వర్ స్లోగా ఉండడం, ఓపీఎంఎస్ సాఫ్ట్‌వేర్‌పై అవగాహన లేకపోవడం, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి సమయం తీసుకుంటుండడం వల్ల ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్నది.
ఫ 4.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో 2 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. తద్వారా వచ్చే పంటను కొనుగోలు చేసేం దుకు జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ ద్వారా 345 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పది రోజుల నుంచివరి కోతలు నడుస్తుండగా, కేంద్రాల్లో కొనుగోళ్లు కూడా చేపట్టారు. కేంద్రాల ద్వారా 4 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యాసం గిలో పండించే ధాన్యం ఎక్కువగా నూక అవుతుంది. రైతులు మొత్తం పంటను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధరలు పొందుతారు. జిల్లాలో 250కి పైగా రైస్ మిల్లులు ఉండగా, 114 మిల్లులకు ధాన్యం ఇవ్వాలని కలెక్టర్, పౌరసరఫరాల శాఖాధికారులు నిర్ణయించారు. కొత్త విధానం వల్ల కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఫ పాత విధానంలోనే కొనుగోళ్లు...
జిల్లాలో పాత విధానంలోనే ధాన్యం కొనుగోళ్లు జరపడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను పాత పద్ధతిలోనే చేపడుతున్నారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో 30 వేల టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాలకు సమీపంలోని రైస్ మిల్లులను కేటాయించారు. ఆన్‌లైన్ విధానానికి తాత్కాలికంగా బ్రేక్ వేశారు. త్వరితగతిన ధాన్యం కొనుగోళ్లు జరపడానికి ప్రయ త్నాలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి, సాధ్యమై నంత తొందరగా రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఆన్‌లైన్ విధానానికి తాత్కలికంగా స్వస్తి పలకడంతో కొత్త విధానం వల్ల ఎదురయిన ఇబ్బందులు తప్పినట్లయిందని కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు, రైతులు అంటున్నారు.