Share News

ధాన్యం కొనుగోళ్లు, తరలింపు వేగంగా పూర్తి చేయాలి

ABN , Publish Date - May 07 , 2026 | 12:43 AM

కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు, తరలింపు వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆదేశించారు.

ధాన్యం కొనుగోళ్లు, తరలింపు వేగంగా పూర్తి చేయాలి

సిరిసిల్ల, మే 6 (ఆంధ్రజ్యోతి): కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు, తరలింపు వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లు, రవాణా తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులు, లారీల ట్రాన్స్‌ పోర్ట్‌ కాంట్రాక్టర్లతో కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారులను నియమించి ధాన్యం సేక రణ చేస్తున్నామని వెల్లడించారు. నెమ్మదిగా అన్‌లోడ్‌ చేస్తున్న రైస్‌ మిల్లులలకు నోటీసులు జారీ చేస్తున్నామని అధికారులు తెలి పారు. ప్రస్తుతం ఉన్న హమాలీలకు అదనంగా తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విప్‌ మాట్లాడుతూ జిల్లాలో ని కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి కొను గోళ్లలో వేగం పెంచా లని, ధాన్యం రవాణా చేయాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ గోదా ముల్లో ధాన్యం దిగుమతికి ఏర్పాట్లు తెలిపారు. లారీల కొరత లేకుండా చూడాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. రవాణా కొరతలేకుండా వ్యాన్లు, ట్రాక్టర్లు ఉపయోగించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. మిల్లులకు దగ్గరగా ఉన్న కొనుగోలు కేంద్రాలకు ట్రాక్టర్‌లతో రవాణా చేసేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్డీవో గీత, డీఏవో అఫ్జల్‌బేగం, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్‌ నరసింహ, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్‌ కుమార్‌, మార్కెటింగ్‌ అధికారి ప్రకాశ్‌, మెప్మా ఏవో మీర్జా ఫసహత్‌ అలీబేగ్‌, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్‌, కార్మిక శాఖ అధికారి నజీర్‌ అహ్మద్‌ తది తరులు పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2026 | 12:43 AM