Share News

ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

ABN , Publish Date - Apr 25 , 2026 | 12:14 AM

కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

బోయినపల్లి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి) : కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ ఆదేశించారు. బోయినపల్లి మండలం విలాసాగర్‌, జగ్గారావు పల్లి, కొదురుపాకలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో శుక్రవారం పరిశీలించారు. రైతుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. తేమ శాతాన్ని పరి శీలించి, నిబంధనలకు అనుగుణంగా ధాన్యం కొనుగోళ్ళు చేయాలని ఆదే శించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసు కోవాలని కోరారు. వర్షాలు పడితే ఇబ్బందులు కలగకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మండలంలోని విలాసాగర్‌ లోని సస్య లక్ష్మి, స్వస్తిక్‌ ఇండస్ట్రీస్‌, జగ్గారావుపల్లిలోని సుహాస్‌ ఆగ్రో రైస్‌ మిల్లును అదనపు కలెక్టర్‌ నగేష్‌ తనిఖీ చేశారు. మిల్లులకు ధాన్యం లోడ్‌తో వచ్చిన వాహనాలను ఆలస్యం చేయకుండా దింపుకొని వాహ నాలు తిరిగి కొనుగోలు కేంద్రాలను వెళ్లేలా సహకరించాలన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 12:14 AM