Share News

ధాన్యం కొనుగోళ్లు, తరలింపును వేగంగా చేపట్టాలి

ABN , Publish Date - May 18 , 2026 | 12:50 AM

ధాన్యం కొనుగోళ్లు, మిల్లులకు తరలింపును వేగంగా చేపట్టాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోళ్లు, తరలింపును వేగంగా చేపట్టాలి

ఎల్లారెడ్డిపేట, మే 17 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లు, మిల్లులకు తరలింపును వేగంగా చేపట్టాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు బొప్పాపూర్‌లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, గోదాంలో ధాన్యం దిగుమతిని ఆదివారం ఆమె పరిశీలించారు. రైతుల వద్ద నుంచి సేకరించిన ధాన్యం, రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు పేరుకుపోవడంపై మిల్లులకు తరలించేందుకు మీరేం చేస్తున్నారని సంబంధిత శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇబ్బందులు కల్గకుండా సకాలంలో ధాన్యం తూకం వేసి వెంటనే మిల్లులకు తరలించేలా చూడాలని ఆదేశించారు. అకాల వర్షాల దాటికి కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు సరిపడా టార్ఫాలిన్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. ఎండ తీవ్రతకు కేంద్రాల్లో హమాలీలు, రైతులు అలిసిపోకుండా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందించాలని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు, తూకం వేసిన బస్తాలను వెనువెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకు రావాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. ఆమె వెంట డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా పౌరసరఫరా అధికారి బుచ్చిబాబు, మేనేజర్‌ నర్సింహా, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, తహసీల్దార్‌ సుజాత, తదితరులు ఉన్నారు.

Updated Date - May 18 , 2026 | 12:50 AM